Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓవల్ మైదానంలో ప్రాక్టీస్ మొదలెట్టిన టీమిండియా

ICC Cricket World Cup 2019 : Team India Net Practice @ Oval Cricket Ground For World Cup || Oneindia
ICC Cricket World Cup 2019: Virat Kohli, MS Dhoni and others hit the nets after India reach London

ఈ నెల 30 నుండి మెగా టోర్నీ ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. రౌండ్ రాబిన్ పద్దతిలో జరగనున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టి వార్మప్ మ్యాచులు కూడా ఆడుతున్నాయి. అయితే టీమిండియా జట్టు బుధవారం లండన్ చేరుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

విరామం అనంతరం గురువారం టీమిండియా ఆటగాళ్లంతా ఓవల్ మైదానంలోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లు అందరూ ప్రాక్టీస్ చేశారు. హెడ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో జట్టు ప్రాక్టీస్లో పాల్గొంది. దీనికి సబంధించిన వీడియో, ఫోటోలను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

ఈనెల 25న ఓవల్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో భారత్‌ తమ తొలి ప్రా క్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఆ తర్వాత 28న కార్డిఫ్‌లో రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో ఆడనుంది. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో భారత్‌ తమ ప్రపంచకప్‌ పోరును మొదలు పెడుతుంది. అయితే టోర్నీ మాత్రం ఈ నెల 30న ఆరంభం కానుంది. టోర్నీలో భారత్ టైటిల్‌ ఫేవరెట్‌గా పోటీకి దిగుతోంది.

Story first published: Thursday, May 23, 2019, 17:12 [IST]
Other articles published on May 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+