
ప్రపంచకప్ ప్రారంభానికి ముందు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) క్వీన్ ఎలిజబెత్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మర్యాద పూర్వకంగా కలిశారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో గురువారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కోహ్లీ.. ఎలిజబెత్‌ను కలిసారు. దీనికి సంబందించిన పోటోలను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
కోహ్లీతో పాటు ఇతర జట్ల కెప్టెన్లు కూడా క్వీన్ ఎలిజబెత్‌ను కలిసారు. వారందరికీ ఎలిజబెత్ 'బెస్ట్ విషెస్' చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ హ్యారీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను రాయల్ ప్యాలెస్, బీసీసీఐలు ట్విటర్‌లో పోస్ట్ చేశాయి. అయితే ఎలిజబెత్‌ను కోహ్లీ కలవడంపై భారత అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు.
'కోహ్లీ ఎలిజబెత్‌ను కలిసావు. మన కోహినూర్ వజ్రంను తీసుకురా' అంటూ ఓ అభిమాని ట్వీట్ చేసాడు. మరోవైపు ఎలిజబెత్, కోహ్లీ మధ్య జరిగిన సంభాషణలను అభిమానులు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'బేటా ఏం కావాలి? ఎలిజబెత్ అనగా.. కోహినూర్ కావాలి' అని కోహ్లీ సమాధానం ఇస్తున్నట్లు మీమ్స్ సెట్ చేశారు. ప్రస్తుతం ఈ మీమ్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మీరు ఓ లుక్కేయండి.