అగ్రస్థానంతో ప్రపంచకప్‌లో అడుగుపెడుతున్న కోహ్లీ, బుమ్రా

మంగళవారం ఎమ్మారెఫ్ టైర్స్ విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్ జఫ్రీత్ బుమ్రాలు అగ్రస్థానంలో నిలిచారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ.. నెంబర్‌వన్ బౌలర్‌గా బుమ్రా తమ టాప్ ప్లేస్‌లను నిలబెట్టుకున్నారు. దీంతో ఈ ఇద్దరు నంబర్‌వన్ ఆటగాళ్లుగా ప్రపంచకప్‌లో అడుగుపెడుతున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాప్ 10లో ముగ్గురు:
విరాట్ ఖాతాలో ప్రస్తుతం 890 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 839 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రాస్ టేలర్ (831), షై హోప్ (808), డికాక్ (803)లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 774 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ట్రెంట్ బౌల్ట్ (759), రషీద్ ఖాన్ (726), ఇమ్రాన్ తాహిర్ (703), కాగిసో రబడ (702)లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కుల్‌దీప్ యాదవ్ (7), చాహల్ (8) స్థానాల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ముగ్గురు టాప్ 10లో బౌలర్లు ఉన్నారు.

అగ్రస్థానం నిలబెట్టుకున్న షకీబుల్:
ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకీబుల్ హసన్ టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. షకీబుల్ ఖాతాలో 359 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను (339)రెండో ర్యాంక్‌లో నిలిచాడు. మహ్మద్ నబీ (319), ఇమాద్ వసీం (289), మిచెల్ సాంట్నర్ (279) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

టాప్ ప్లేస్‌లో ఇంగ్లాండ్:
ఐసీసీ జట్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ ఖాతాలో ప్రస్తుతం 125 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత జట్టు 121 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా (115), న్యూజీలాండ్ (113), ఆస్ట్రేలియా (109)లు వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచకప్ బుధవారం గురువారం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, సౌతాఫ్రికాల మధ్య జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications