'విరాట్ కోహ్లీ మనిషి కాదు.. పరుగుల మెషీన్'

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మనిషి కాదు.. పరుగుల మెషీన్ అని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా పేర్కొన్నారు. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా ఈ నెల 30 నుండి ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్ జట్టుగా భారత్ బరిలోకి దిగుతోంది. పలువురు దిగ్గజ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు బ్యాటింగ్, బౌలింగ్ ఉంది. ముఖ్యంగా పరుగుల వీరుడు కోహ్లీ ఉన్నాడు కాబట్టి భారత జట్టే ఫేవరెట్ అంటున్నారు.

పరుగుల మెషీన్:
తాజాగా బ్రియాన్ లారా కూడా విరాట్ కోహ్లీపై స్పందించాడు. 'అతను ఓ పరుగుల మెషీన్. 80-90లో కంటే కోహ్లీ ప్రత్యేకమైన ఆటగాడు. ప్రస్తుతం నిరంతరం క్రికెట్ ఆడుతున్న కారణంగా ఫిట్ నెస్ చాలా అవసరం. కోహ్లీ ఇందులో ముందున్నాడు. మైదానంలోకి వచ్చిన ప్రతిసారి పరుగులు చేస్తున్నాడు. సచిన్ ఎప్పటికీ గొప్ప బ్యాట్స్‌మన్. సచిన్, కోహ్లీలను పోల్చలేను. కానీ.. కోహ్లీకి ప్రత్యేక టాలెంట్ ఉంది. అతను రాబోయే క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తాడు' అని లారా పేర్కొన్నారు.

బెస్ట్ బౌలర్:
'ఒకవేళ బుమ్రాను నేను ఎదుర్కొవాల్సి వస్తే.. స్ట్రైక్ రాకుండా చూసుకుంటాను. లేదా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అతనిపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తా. బుమ్రా బౌలింగ్ శైలి కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అతను భారత బెస్ట్ బౌలర్. ఈ ప్రపంచకప్‌లో బ్యాట్స్‌మన్‌లు అతనిపై ఓ కన్నేసి ఉంచండి' అని లారా సూచించారు.

ఇంగ్లండ్ కూడా ప్రమాదమే:
భారత జట్టు మంచి సమతూకంతో ఉంది. అన్ని పరిస్థితుల్లోనూ రాణించగల సామర్థ్యం భారత జట్టుకు ఉంది. భారత జట్టు చాలా బలంగా ఉంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇక సొంత గడ్డపై ఇంగ్లండ్ కూడా ప్రమాదమే. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ జట్టు అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకోలేదు.. ఈ సారి ఆ జట్టు కల సాకారమవుతుందో? లేదో? చూడాలి' అని లారా పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications