న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సమస్య ఉంటే ప్రతి ఒక్కరు అతని వైపే చూస్తారు'

ICC World Cup 2019: Dhoni Gives Us Freedom,Kohli Gives Us Confidence, Says Kuldeep Yadav!!
ICC Cricket World Cup 2019: Virat Kohli gives us confidence, MS Dhoni gives us freedom says Kuldeep Yadav

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వద్ద ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. జట్టులో ఎవరికీ సమస్య ఉన్నా ధోనీ వైపే చూస్తారు అని టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తెలిపారు. అశ్విన్, జడేజాల స్థానాలను కైవసం చేసుకుని గత కొంత కాలంగా వన్డే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కుల్దీప్‌-చహల్‌ల జోడి. మధ్య ఓవర్లలో పరుగులు నియంత్రించడమే కాకుండా.. వికెట్లు తీస్తున్నారు. ప్రపంచకప్‌లో కూడా ఈ జోడి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

ధోని వైపు చూస్తే చాలు:

ధోని వైపు చూస్తే చాలు:

తాజాగా కుల్దీప్‌ మాట్లాడుతూ ధోనీని ప్రశంసలతో ముంచెత్తాడు. 'ధోనీ వద్ద ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఎవరికీ సమస్య ఉన్నా ధోనీ వైపే చూస్తారు. బ్యాట్స్‌మన్‌ బాగా ఆడుతున్నప్పుడు ఎక్కడ బంతులు వేయాలో తెలియక ఇబ్బంది పడితే ఒకసారి ధోని వైపు చూస్తే చాలు.. నా సమస్యను అర్థం చేసుకొని ఎలా బంతులు ఎక్కడ వేయాలో చెప్తాడు. ఏ బ్యాట్స్‌మన్కు ఏ బాల్ వేయాలో కచ్చితంగా చెప్తాడు. అతని సూచనలు చాలాసార్లు పనికొచ్చాయి' అని కుల్దీప్‌ తెలిపాడు.

ధోనీ ఉంటే ధైర్యంగా ఉండొచ్చు:

ధోనీ ఉంటే ధైర్యంగా ఉండొచ్చు:

'జట్టులో నేను ఒక్కడినే కాదు బౌలర్లంతా ధోనీ వైపే చూస్తారు. వికెట్ల వెనక ధోనీ భాయ్ ఉంటే ధైర్యంగా ఉండొచ్చు. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మాపై విశ్వాసం ఉంచి ఆటగాళ్లకు ధైర్యాన్ని ఇస్తాడు. మహీ భాయ్ స్వేచ్చనిస్తాడు. చహల్, నాకు మధ్య మంచి అవగాహన ఉంది. మధ్య ఓవర్లు చాలా కీలకం. మేము వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తాం' అని కుల్దీప్ పేర్కొన్నాడు.

ఆతృతగా ఎదురు చూస్తున్నా:

ఆతృతగా ఎదురు చూస్తున్నా:

'ఎప్పుడైనా విఫలం అయితే వాటి నుండి నేర్చుకుని పుంజుకుంటాం. ఇదే ఇప్పటివరకు చేసాం. ప్రపంచకప్‌లో కూడా మంచి ప్రదర్శన చేస్తాం. ఐపీఎల్-12తో ఇప్పటికే చాలా క్రికెట్ ఆడాం. ప్రపంచకప్‌కు అన్ని విధాలుగా సన్నద్ధం అయ్యాం. తొలి మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా' అని కుల్దీప్ చెప్పుకొచ్చారు.

Story first published: Tuesday, May 28, 2019, 15:48 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X