Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేఎల్ రాహుల్ ఇంటర్వ్యూను డిస్టర్బ్ చేసిన విరాట్ కోహ్లీ (వీడియో)

ICC Cricket World Cup 2019 : Virat Kohli Disturb's KL Rahul's Chahal TV Interview || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Virat Kohli crashes KL Rahuls interview on Chahal TV

మైదానంలో ఆటగాళ్లపై అసహనం చూపినా, అంపైర్లపై దూకుడుగా ప్రవర్తించినా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకే చెల్లింది. అయితే కోహ్లీ మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో మైదానం ఆవల అంతే సరదాగా ఉంటాడు. ఇక డ్రెస్సింగ్ రూంలో అయితే తోటి ఆటగాళ్లను ఆటపట్టింస్తుంటాడు. ఇదే మరోసారి రుజువైంది. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర 'చాహల్' టీవీలో విరాట్ కోహ్లీ తన చిలిపి తనంను చూపించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టీమిండియా ఇప్పటికే ప్రపంచకప్ సెమీస్‌కు అర్హత సాధించింది. శ్రీలంకతో సమరంకు రెండు రోజుల సమయం ఉండడంతో టీమిండియా ఆటగాళ్ళు సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే చాహల్ ఎప్పటిలాగే తన చాహల్ టీవీని కొనసాగించాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఇంటర్వ్యూ చేశాడు. రాహుల్‌ను చాహల్ ఇంటర్వ్యూ చేస్తున్న విషయాన్ని విరాట్ కోహ్లీ గమనించి.. ఇంటర్వ్యూ మధ్యలో వెళ్లి రాహుల్‌ను ఏదో అడిగాడు.

దీంతో కెమెరాను కోహ్లీ వైపు తిప్పించిన చాహల్.. 'కావాలనే ఇలా చేశావ్ కదా కోహ్లీ భయ్యా. చాహల్ టీవిలో కనిపించాలన్న ఆతృత నీక్కూడా ఉంది. ఈ టీవిలో కనిపించాలని ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నాడో చూడండి' అంటూ కోహ్లీని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. అయితే కోహ్లీ మాత్రం తాను కావాలని చేయలేదని.. రాహులే నన్ను పిలిచాడంటూ చెప్పాడు. అనంతరం కోహ్లీ అక్కడి నుండి వెళ్లిపోగా ఇంటర్వ్యూ కొనసాగింది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారికి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు తెగ షేర్ చేస్తూ.. తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు. శనివారం టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.

Story first published: Friday, July 5, 2019, 15:38 [IST]
Other articles published on Jul 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+