ప్రపంచకప్‌లో కాకుండా ఐపీఎల్‌లోనే గడ్డుకాలం ఎదురైనందుకు సంతోషిస్తున్నాం'

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చైనామన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్ ఫామ్ చూసి ఆందోళన చెందడం లేదు. ప్రపంచకప్‌లో అతడు స్థిరంగా రాణిస్తాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా బౌలింగ్ దాడిలో కుల్‌దీప్, యుజువేంద్ర చాహల్ మూల స్తంభాలని కోహ్లీ పేర్కొన్నారు. ప్రపంచకప్ సన్నద్ధతపై మంగళవారం ఓ మీడియా సమావేశంలో కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలు వివరాలు వెల్లడించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

కుల్‌దీప్ పుంజుకుంటాడు:
ఐపీఎల్‌లో కొన్ని మ్యాచులలో కుల్‌దీప్ విఫలమవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు అతన్ని చివరి మ్యాచులలో తప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయం కోహ్లీ స్పందిస్తూ... 'కుల్‌దీప్ విజయవంతమైన బౌలర్. ఏ ఆటగాడైనా గడ్డుకాలం ఉంటుంది. అది కుల్‌దీప్‌కు ఐపీఎల్‌లోనే ఎదురైంది. ప్రపంచకప్‌లో కాకుండా ఐపీఎల్‌లోనే గడ్డుకాలం ఎదురైనందుకు సంతోషిస్తున్నాం. తన పొరపాట్లు త్వరగా సరిదిద్దుకొని పుంజుకుంటాడు' అని కోహ్లీ ధీమా వ్యక్తం చేసాడు.

వారే మూల స్తంభాలు:
'మా బౌలింగ్ విభాగం బాగుంది. చాహల్, కుల్‌దీప్ నైపుణ్యాలు మాకు తెలుసు. ఎలాంటి వికెట్ ఉన్నా ఈ జోడి రాణించగలదు. మా బౌలింగ్ దాడిలో కుల్‌దీప్, చాహల్‌లు రెండు మూల స్తంభాలు. కేదార్ జాదవ్ ఫామ్ గురించి కూడా ఎలాంటి ఆందోళన లేదు. ఐపీఎల్‌లో అతను ఆడిన పిచ్‌లు ఎలా ఉన్నాయో మాకు తెలుసు. కొన్ని మ్యాచులలో అతడు అద్భుత ప్రదర్శన చేసాడు. ప్రపంచకప్‌లో కూడా పరుగులు చేస్తాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇది ఛాలెంజింగ్ ప్రపంచకప్:
'ఈ ప్రపంచకప్ ఛాలెంజింగ్ ప్రపంచకప్. టోర్నీలో పాల్గొనే ఏ జట్టైనా మిగతా జట్టుపై గెలవొచ్చు. ఇంగ్లాండ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి. ఈ ప్రపంచకప్‌లో అన్ని రకాల స్కోర్లను అంచనా వేస్తున్నాం. కొన్ని మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది' అని కోహ్లీ అన్నాడు.

ఆటపై ఫోకస్ పెట్టింది:
ఈ ప్రపంచకప్‌లో జట్టంతా ఆటపై ఫోకస్ పెట్టింది. అసలు ప్రత్యర్ధి ఎవరనేది ఆలోచన చేయడం లేదు. ఈ ప్రపంచకప్‌లో ఒత్తిడిని ఎదుర్కోవడం అత్యంత ముఖ్యం. మా బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఐపీఎల్ ఆడటం వల్ల అలసిపోలేదు. ఈ మెగా టోర్నీలో ఆటను ఎంజాయ్ చేస్తే కప్పు మనదేనని' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications