ఫన్ టైమ్ విత్ బాయ్స్.. సౌతాంప్టన్‌లో విహరిస్తున్న కోహ్లీసేన

ప్రపంచకప్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం కోహ్లీసేన సౌథాంప్టన్‌లో ఉంది. రెండు వార్మప్ మ్యాచ్‌లు ముగిశాక రెండు రోజులు నెట్స్‌లో తీవ్ర సాధన చేశారు టీమిండియా ఆటగాళ్లు. అయితే టీమిండియాకు జూన్ 5న మ్యాచ్ ఉండటంతో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా వివిధ ప్రాంతాలలో విహరిస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
పెయింట్ బాలింగ్ ఆటలో కోహ్లీసేన:
ఈ క్రమంలోనే తాజాగా జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు పెయింట్ బాలింగ్ గేమ్ ఆడటానికి సౌతాంప్టన్ వెళ్లారు. కోహ్లీతో పాటు ఈ గేమ్ ఆడటానికి ధోనీ, చహల్, రాహుల్, ధావన్, దీపక్ చాహర్, బుమ్రా, కుల్దీప్, దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మలు వెళ్లారు. ఈ ఆటకు సంబంధించిన ఫోటోను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసాడు. 'ఫన్ టైమ్ విత్ బాయ్స్' అంటూ రాసాడు.
అభిమానుల విమర్శలు:
ఆటగాళ్లు సైనిక దుస్తుల తరహాలో యూనిఫాం ధరించిన ఒక ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ప్రపంచకప్ లాంటి కీలక టోర్నీకి ముందు ఆటగాళ్లు నెట్స్‌లో సాధన చేయకుండా.. విహారానికి వెళ్లడంపై అభిమానులు విమర్శలు గుప్పించారు.

జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్:
ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భాగంగా టీమిండియా జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సఫారీ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో జూన్ 2న బంగ్లాదేశ్.. జూన్ 5న టీమిండియాతో జరిగే మ్యాచ్‌లను సఫారీ జట్టు సవాలుగా తీసుకోనుంది. టీమిండియా అన్ని విభాగాల్లో ఆధిపత్యం కొనసాగిస్తేనే తొలి విజయం దక్కుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications