ఫోటోలు: లండన్‌లోని భారత హైకమిషనర్ ఇంటిని సందర్శించిన కోహ్లీసేన

హైదరాబాద్: వరల్డ్‌కప్ టోర్నీ కోసం ప్రస్తుతం లండన్‌లో ఉన్న కోహ్లీసేన అక్కడ ఉన్న భారత హైకమిషనర్ ఇంటిని శుక్రవారం సందర్శించింది. టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాంప్టన్ నుంచి గురువారం టీమిండియా లండన్‌కు చేరుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టీమిండియాకు విందు
అయితే, కీలకమైన ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్‌కు వరుణుడు అడ్డం పడ్డాడు. వర్షం కారణంగా శుక్రవారం ప్రాక్టీస్ సాగలేదు. మరోవైపు టీమిండియాను బ్రిటన్‌లో భారత హైకమిషనర్ రుచి ఘనశ్యామ్ శుక్రవారం విందుకు ఆహ్వానించారు. ఈ విందుకు కెప్టెన్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రితో సహా జట్టు సభ్యులందరూ హాజరయ్యారు.
బీసీసీఐ ట్విట్టర్‌లో పోటోలు
ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ మెగా టోర్నీని కోహ్లీసేన విజయంతో ఆరంభించింది. టోర్నీలో భాగంగా సపారీలతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు.

8 మ్యాచ్‌ల్లో నెగ్గిన ఆసీస్
ఇదిలా ఉంటే, శుక్రవారం వర్షం కారణంగా టీమిండియా ప్రాక్టీస్ రద్దు కావడంతో... ఆస్ట్రేలియాతో మ్యాచ్ సన్నాహానికి టీమిండియా శనివారం ఒక్క రోజే అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 11 మ్యాచ్‌లు జరగ్గా 8 మ్యాచ్‌ల్లో ఆసీస్ నెగ్గగా... భారత్ మూడింట విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications