Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌.. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న టీమిండియా ప్లేయర్లు

ICC World Cup 2019:Virat Kohli And Co. Sweat At Gym Ahead Of India's World Cup Opening
ICC Cricket World Cup 2019: Virat Kohli and Co sweat at gym ahead of Indias World Cup opening fixture vs South Africa

ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న సౌతాఫ్రికాతో తలపడనుంది. ప్రపంచకప్‌లోని మొత్తం పది జట్లలో ఇప్పటికే దాదాపు అన్ని జట్లు తమ తొలి మ్యాచ్‌ను ఆడాయి. ఆదివారం సౌతాఫ్రికా రెండో మ్యాచ్ ఆడగా.. ఈ రోజు ఇంగ్లాండ్ రెండవ మ్యాచ్ ఆడనుంది. అయితే టీమిండియా మాత్రం ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఈ సమయాన్ని టీమిండియా ప్లేయర్లు బాగానే ఉపయోగించుకుంటున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తొలి మ్యాచ్‌ కోసం టీమిండియా ప్లేయర్లు ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా వివిధ ప్రాంతాలలో విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం టీమిండియా ప్లేయర్లు జిమ్‌లో కసరత్తులు చేశారు. జిమ్‌ సెషన్ అనంతరం ఫొటోకు పోజులిచ్చారు. ఫొటోలో కెప్టెన్ కోహ్లీ, జాదవ్, శంకర్, భువీ, పాండ్యా, రాహుల్, బుమ్రాలు ఉన్నారు. ఈ ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయింది.

రెండు రోజుల ముందు జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది, రిజర్వ్‌ ఆటగాళ్లు పెయింట్‌ బాలింగ్‌ గేమ్‌ ఆడటానికి సౌతాంప్టన్‌ వెళ్లారు. కోహ్లీతో పాటు ఈ గేమ్‌ ఆడటానికి ధోనీ, చహల్‌, రాహుల్‌, ధావన్‌, దీపక్‌ చాహర్‌, బుమ్రా, కుల్దీప్‌, దినేశ్‌ కార్తీక్‌, రోహిత్‌ శర్మలు వెళ్లారు. ఈ ఆటకు సంబంధించిన ఫోటోను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేసాడు. 'ఫన్‌ టైమ్‌ విత్‌ బాయ్స్‌' అంటూ రాసాడు.

ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా టీమిండియా జూన్‌ 5న సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సఫారీ​ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. ఇక ఆదివారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండవ మ్యాచ్‌లో కూడా సౌతాఫ్రికా ఓడిపోయింది. దీంతో టీమిండియాతో జరిగే మ్యాచ్‌లను సఫారీ​ జట్టు సవాలుగా తీసుకోనుంది. మరోవైపు టీమిండియాకు తోలి మ్యాచ్. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాను ఎదుర్కోవాలంటే సౌతాఫ్రికాకు కష్టమే.

Story first published: Monday, June 3, 2019, 11:29 [IST]
Other articles published on Jun 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+