Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌కు ముందే ఆస్ట్రేలియాకు భారీ షాక్...

ICC Cricket World Cup 2019 : Usman Khawaja Suffers Knee Injury In Warm-Up Match || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Usman Khawaja suffers knee injury in warm-up match againest Sri Lanka

మెగా టోర్నీ ప్రపంచకప్‌ అసలు సమరం ఇంకా మొదలే కాలేదు. ఈలోగానే పలు జట్లను గాయాల బెడద బాధిస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్పిన్నర్ ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్‌లు గాయాలపాలయ్యారు. టీమిండియాలో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఆసీస్ కూడా చేరింది.

ఖవాజాకు గాయం:

ఖవాజాకు గాయం:

ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖవాజా గాయపడ్డాడు. సోమవారం శ్రీలంకతో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా అతడికి ఎడమ మోకాలికి బంతి తగిలింది. దీంతో వెంటనే ఆసీస్‌ వైద్యుడు వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో ఖవాజా మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రతపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు. అయితే అనంతరం అతడు బ్యాటింగ్ చేసాడు. దీంతో గాయం తీవ్రత పెద్దది కాదని తెలుస్తోంది. ఇపుడు బాగానే ఉన్నా.. అసలు పోరు వరకు గాయం ఏమైనా తిరుగబడుతుందో అని ఆసీస్ ఆందోళనలో ఉంది.

తొలి వార్మప్‌ మ్యాచ్‌లో కూడా:

తొలి వార్మప్‌ మ్యాచ్‌లో కూడా:

గత బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లోనూ ఖవాజాకు గాయమైంది. ఆసీస్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఖవాజా దవడకి బంతి బలంగా తగిలింది. దీంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. స్కానింగ్‌లో ఎముక విరగలేదని తేలడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. సోమవారం మరలా గాయం అవ్వడంతో ఆసీస్ జట్టు ఆందోళనకు గురైంది.

 శ్రీలంకపై విజయం:

శ్రీలంకపై విజయం:

రెండవ వార్మప్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 5 వికెట్లతో శ్రీలంకపై విజయం సాధించింది. తొలుత శ్రీలంక 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. తిరిమన్నే (56), డిసిల్వా (43)లు రాణించారు. ఆసీస్ స్పిన్నర్ జంపా 2 వికెట్లు తీసాడు. అనంతరం ఆస్ట్రేలియా 44.5 ఓవర్లలో 5 వికెట్లకు 241 పరుగులు చేసి గెలిచింది. ఖవాజా (83) అర్ధ సెంచరీ చేసాడు.

Story first published: Tuesday, May 28, 2019, 9:26 [IST]
Other articles published on May 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+