Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క వన్డే ఆడకుండానే.. ప్రపంచకప్‌లో చోటు

ICC Cricket World Cup 2019: Uncapped Tom Blundell surprise inclusion New Zealand World Cup squad, Follows Jofra Archer, Mohammad Saifuddin, Ikram Ali

ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో ఆడాలని ప్రతి ఒక్క ఆటగాడు అనుకుంటాడు. అయితే కొందరికి ఎంత అనుభవం ఉన్నా.. ఈ అవకాశం మాత్రం అంత సులువుగా రాదు. మరికొందరికి ఎలాంటి అనుభవం లేకున్నా అదృష్టం కలిసొచ్చి ఈ అవకాశం తలుపుతడుతుంది. ఈ అదృష్టమే న్యూజిలాండ్‌ ఆటగాడు టామ్‌ బ్లండెల్‌ను వరించింది. మరికొందరు 2-3 వన్డేలలో ఆడి అవకాశం పొందుతారు. ప్రస్తుతం ప్రపంచకప్‌-2019లో ఇలా అవకాశం పొందిన ఆటగాళ్లు ఉన్నారు. వారిని ఓ సారి పరిశీలిస్తే.

ఒక్క వన్డే ఆడకుండానే:

ఒక్క వన్డే ఆడకుండానే:

టామ్‌ బ్లండెల్‌ క్రికెట్ అభిమానికి తెలియని పేరు. ఒక్క వన్డే కూడా ఆడకుండానే న్యూజిలాండ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సీనియర్, టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ టామ్‌ లాథమ్‌ వేలికి గాయం కావడంతో తొలి మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిస్ట్ మ్యాచులలో సత్తా చాటిన వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ బ్లండెల్‌ను కివీస్‌ బోర్డు జట్టులో తీసుకుంది. అయితే సిఫెర్ట్‌, వాట్లింగ్‌ లాంటి భారీ హిట్టర్లు ఉన్నా.. కూడా బ్లండెల్‌నే తీసుకోవడం విశేషం. శ్రీలంకతో కివీస్‌ ఆడే తొలి మ్యాచ్‌లో అతడు ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నెల 25న భారత్‌తో, 28న వెస్టిండీస్‌తో జరిగే వార్మప్‌ మ్యాచ్‌ల్లో బ్లండెల్‌ ఆడుతున్నాడు.

ఆడింది 2 వన్డేలే:

ఆడింది 2 వన్డేలే:

వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ ఇక్రమ్‌ అలీ ఖిల్‌ (18) ఆడింది 2 వన్డేలే అయినా అఫ్గాన్‌ ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించాడు. ప్రపంచకప్‌-2019లో ఆడబోతున్న పిన్న వయస్కుడు. గత మార్చిలో ఐర్లాండ్‌పై వన్డేతో అరంగేట్రం చేసిన ఇక్రమ్‌.. భారీ హిట్టింగ్ చేయగలడు. అవకాశం వస్తే సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. అఫ్గాన్‌ జట్టులో మిస్టరీ స్పిన్నర్ ముజీబ్‌ రెహ్మాన్‌ (18), కరీమ్‌ జానత్‌ (20)లు కూడా ఉన్నారు.

 ఐపీఎల్‌లో సత్తా చాటి

ఐపీఎల్‌లో సత్తా చాటి

టీ20ల్లో గత కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శన చేస్తున్న వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా అనూహ్యంగా ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌ కౌంటీ జట్టు ససెక్స్‌ తరఫున ఆడుతున్న ఆర్చర్‌.. అద్భుత ప్రదర్శనతో ఆకర్షించాడు. బిగ్‌బాష్‌, పాకిస్థాన్‌ ప్రిమియర్‌ లీగ్‌, బంగ్లాదేశ్‌ ప్రిమియర్‌ లీగ్‌లతో సత్తా చాటాడు. ఫలితంగా ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.7.2 కోట్లు వెచ్చించి కొనుక్కుంది. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన చేసిన ఆర్చర్‌.. ఇంగ్లాండ్‌ తరఫున ఆడే అవకాశాన్ని సంపాదించాడు. ఇంగ్లాండ్ బోర్డు సీనియర్ డేవిడ్‌ విల్లీని తప్పించి ఆర్చర్‌ను తీసుకుంది.

 150 కి.మీ వేగంతో బంతులు సంధించి:

150 కి.మీ వేగంతో బంతులు సంధించి:

మహ్మద్‌ హస్నైన్‌ (19) కూడా అనూహ్యంగా పాక్ జట్టులో చోటు సంపాదించాడు. అత్యంత వేగంగా బంతులేయడంతో పాటు పరుగుల నియంత్రణ కూడా చేయగలడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో సత్తా చాటడంతో సెలెక్టర్ ఇంజమాముల్‌ పాక్ జట్టులోకి ఎంపిక చేసాడు. ఇతని కోసం సీనియర్ జునైద్‌ఖాన్‌ లాంటి ఆటగాడిని కూడా పక్కన పెట్టారు. హస్ననిన్‌ ఇప్పటిదాకా 5 వన్డేలు ఆడి 5 వికెట్లు తీసాడు. పెద్ద జట్లేవి కూడా ఇతని బౌలింగ్ ఎదుర్కోలేదు. ఇది పాక్ జట్టుకు కలిసొచ్చే అంశం.

13 వన్డేలు.. 11 వికెట్లు:

13 వన్డేలు.. 11 వికెట్లు:

బంగ్లా ప్రిమియర్‌ లీగ్‌లో సత్తా చాటి.. ఆ జట్టుకు ఎంపికై ఆకట్టుకున్నాడు పేస్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ సైఫుద్దీన్‌ (22). ఇతగాడిపై బంగ్లా భారీ ఆశలే పెట్టుకుంది. వేగానికి తోడు, వైవిధ్యం ఉండడం సైఫుద్దీన్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. మిడిల్‌ ఓవర్లలో పరుగులు నియంత్రించడంతో పాటు వికెట్లు తీయగలడు. ఇప్పటిదాకా 13 వన్డేలాడిన సైఫుద్దీన్‌ 11 వికెట్లు తీసాడు. మరోవైపు ఒక అర్ధసెంచరీ చేసాడు.

Story first published: Friday, May 24, 2019, 13:19 [IST]
Other articles published on May 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+