For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ ముందు కివీస్‌కు ఎదురుదెబ్బ: తొలి మ్యాచ్‌కు అనుమానమే?

ICC Cricket World Cup 2019: Tom Latham to miss warm-up games due to injury

న్యూజిలాండ్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌, వికెట్‌కీపర్‌ టామ్‌ లాతమ్ ప్రపంచకప్‌ వార్మప్ మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. వేలి గాయం కారణంగా ఈ నెల 25న భారత్‌తో, 28న వెస్టిండీస్‌తో జరిగే వార్మప్‌ మ్యాచ్‌లలో లాతమ్ ఆడడం లేదు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియంసన్ తెలిపారు. ఈ నెల మొదటిలో ఆస్ట్రేలియా -ఎలెవన్ జట్టుతో ఆడిన మ్యాచులో లాతమ్ గాయపడడ్డాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

లాతమ్ స్థానంలో యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ బ్లండెల్‌ వార్మప్‌ మ్యాచ్‌లలో ఆడనున్నాడు. మరోవైపు శ్రీలంకతో కివీస్‌ ఆడే తొలి మ్యాచ్‌లో కూడా లాతమ్ ఆడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. జూన్ 1వ తేదీ వరకు లాతమ్ గాయం నుండి కోలుకోకుంటే.. అతని స్థానంలో బ్లండెల్‌ ఆడుతాడు. ఇదే నిజమయితే బ్లండెల్‌కు అదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుంది.

గురువారం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కెప్టెన్ల అధికారిక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అన్ని జట్ల కెప్టెన్లు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కివీస్ కెప్టెన్ కేన్ మాట్లాడుతూ... 'లాతమ్ రెండు వార్మప్‌ మ్యాచ్‌లలో ఆడడం లేదు. అతను గాయం నుండి త్వరగా కోలుకుంటాడు అని అనుకుంటున్నాం. తొలి మ్యాచ్ కల్లా ఫిట్ గా ఉంటాడు' అని కేన్ ఆశాభావం వ్యక్తం చేసాడు.

టామ్‌ బ్లండెల్‌ క్రికెట్ అభిమానికి తెలియని పేరు. ఒక్క వన్డే కూడా ఆడకుండానే న్యూజిలాండ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టామ్‌ లాథమ్‌ వేలికి గాయం కావడంతో తొలి మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిస్ట్ మ్యాచులలో సత్తా చాటిన వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ బ్లండెల్‌ను కివీస్‌ బోర్డు జట్టులో తీసుకుంది. అయితే సిఫెర్ట్‌, వాట్లింగ్‌ లాంటి భారీ హిట్టర్లు ఉన్నా.. కూడా బ్లండెల్‌నే తీసుకోవడం విశేషం.

Story first published: Friday, May 24, 2019, 14:03 [IST]
Other articles published on May 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+