Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సలహా కావాలంటే ధోనీ భాయ్‌నే అడుగుతా...

ICC Cricket World Cup 2019 : Vijay Shankar Says The Team’s Need Is My Priority || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: The team’s need is my priority says Vijay Shankar

నాకు ఎలాంటి సందేహం వచ్చినా, సలహా కావాలన్నా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే అడుగుతా అని టీంఇండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ తెలిపారు. మే 30 నుండి ప్రపంచకప్‌ సమరం మొదలు కానుంది. ప్రపంచకప్‌ జట్టులో విజయ్‌ శంకర్‌ చోటు దక్కించుకున్నాడు. నాలుగో స్థానంలో రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడుని కాదని ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌కే ఓటేశారు సెలెక్టర్లు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఐపీఎల్‌-12లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన శంకర్ పెద్దగా ఆకట్టుకోలేదు. కీలక సమయంలో క్రిజులోకి వచ్చి కూడా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. దీంతో విమర్శల వర్షం కురిసింది. శంకర్ ఇక ప్రపంచకప్‌పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. అయితే తాజాగా శంకర్‌ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు.

ఒత్తిడికి లోను కాను:

ఒత్తిడికి లోను కాను:

'న్యూజీలాండ్ టీ20 సందర్భంగా మూడో స్థానంలో పరుగులు చేసాను. జట్టు యాజమాన్యం నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చింది. పరిస్థితులను అనుగుణంగా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలను. ఎటువంటి ఒత్తిడికి లోను కాను. జట్టు వసరాన్ని బట్టి బ్యాటింగ్ శైలిని మార్చుకుంటా' అని శంకర్ తెలిపారు.

వారిని చూసి నేర్చుకున్నా:

వారిని చూసి నేర్చుకున్నా:

'క్రికెట్ మొదలుపెట్టినప్పుడు.. భారత జట్టులో చోటు సంపాదించడమే నా కల. అది నిజమయినందుకు సంతోషంగా ఉంది. నాకే సందేహం వచ్చినా, సలహా కావాలన్నా ధోనీ భాయ్‌నే అడుగుతా. ఒత్తిడిని ఎలా జయించాలో ధోనీ, రోహిత్‌, కోహ్లీలను చూసి నేర్చుకున్నా. వారిని దగ్గర నుండి చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. ఒక మంచి క్రికెటర్ గా ఎదగడానికి వారి సలహాలు ఎంతో ఉపయోగపడుతాయి' అని శంకర్ పేర్కొన్నారు.

జీవితాన్నే మార్చింది:

జీవితాన్నే మార్చింది:

'క్రికెటర్‌గా నా జీవితాన్నే మార్చింది మాత్రం నిదహాస్‌ ట్రోఫీనే. ఈ ట్రోఫీ జరిగి సంవత్సరం గడిచినా.. నాకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేదే. ఈ ట్రోఫీ గెలిచిన తర్వాత 50కి పైగా ఫోన్‌ కాల్స్ వచ్చాయి. కష్టాల్లో ఎన్నో నేర్చుకుంటాం. అది క్రికెట్‌లో అయినా.. జీవితంలో అయినా. నాకు క్రికెట్‌ అంటే ఏమిటో నిదహాస్‌ ట్రోఫీ ద్వారానే తెలిసింది' అని శంకర్ చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, May 16, 2019, 14:13 [IST]
Other articles published on May 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+