దక్షిణాఫ్రికా టీమ్ విశ్లేషణ: సఫారీల కల ఈసారైనా నెరవేరుతుందా?

హైదరాబాద్: ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న జట్లలో దక్షిణాఫ్రికా ఒకటి. ప్రతిసారీ వరల్డ్‌కప్‌లో కప్ గెలవాలనే తపనతోనే బరిలోకి దిగుతుంది. అయితే, ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. 1992 నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు సెమీపైనల్‌కు చేరింది. అయితే, కప్పు గెలవాలన్న కల మాత్రం కలగానే మిగిలిపోయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
జట్టులో స్టార్ బ్యాట్స్‌మన్ ఉన్నప్పటికీ కీలక మ్యాచ్‌ల్లో తీవ్ర ఒత్తిడికి గురవడమో లేక, దురదృష్టం తోడవడమో ఆ జట్టు ఓటమికి కారణమవుతున్నాయి. మే30 నుంచి జులై 14వ జరగనున్న ఈ మెగా టోర్నీలో సఫారీలు ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ది ఓవల్ (లండన్) స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
ప్రస్తుతం ఐసీసీ ర్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉన్న సపారీలు ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌లోనైనా ఆ జట్టు కల నెరవేరుతుందా? లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ మెగా టోర్నీలో దక్షిణాప్రికా డుప్లెసిస్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది.

సఫారీల బలం
బౌలింగే ఆ జట్టు ప్రధాన బలం. ఈసారి కూడా కగిసో రబాడ, డేల్ స్టెయిన్ లాంటి పదునైన బౌలింగ్‌తో దక్షిణాప్రికా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగుతోంది. వీరికి తోడు లుంగి ఎంగిడి బౌన్స్, ప్రిటోరియస్ పేస్ జట్టుకు అదనపు బలం. ఇక, ఇమ్రాన్ తాహిర్ రూపంలో మంచి స్పిన్నర్ ఆ జట్టులో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్‌లో ఇమ్రాన్ తాహిర్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పుల్ క్యాప్‌ని దక్కించుకున్నాడు. బహుశా తాహిర్‌కు ఇదే చివరి వరల్డ్ కప్ కావొచ్చు. ఈ నేపథ్యంలో అతడు అద్భుత ప్రదర్శన చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు తాహిర్‌కు తోడు ఎడమచేతి వాటం స్పిన్నర్ తబ్రైజ్ షంసితో స్పిన్ విభాగం బలంగా కనిపిస్తోంది.

బలహీనతలు
ఈ వరల్డ్‌కప్‌లో సఫారీలను వేధిస్తోన్న ప్రధాన సమస్య బ్యాటింగ్ లైనప్. ఆ జట్టు ఓపెనర్లు హషమీ ఆమ్లా, మార్‌క్రమ్ ఫామ్‌లో లేరు. వరల్డ్‌కప్ జట్టులో ఈ ఇద్దరిలో ఒక్కరే ఎంపికవుతారని భావించారు. అయితే, సెలక్టర్లు మాత్రం అనూహ్యంగా ఇద్దరికీ జట్టులో చోటు కల్పించారు. కెప్టెన్ డుప్లెసిస్, డికాక్ మినహా ఎవరూ ఫామ్‌లో లేరు. మిడిలార్డర్‌లో డేవిడ్ మిల్లర్, జేపీ డుమిని జట్టుని ఏ విధంగా ఆదుకుంటారనేది ప్రశ్నార్ధకంగా ఉంది. లోయర్ ఆర్డర్‌లో జట్టుని ఆదుకునేందుకు సరైన బ్యాట్స్‌మన్ లేడు. ఐపీఎల్‌లో గాయపడిన డేల్ స్టెయిన్ ఫిట్‌నెస్ సైతం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

గత వరల్డ్‌కప్‌ల్లో ఇలా
1992 నుంచి వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆడుతున్న దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. 1992, 1999, 2007, 2015లో సెమీఫైనల్ వరకు చేరుకుంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో సఫారీలు ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు ఆడి 35 విజయాలు నమోదు చేయగా 18 మ్యాచ్‌ల్లో ఓడారు. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

దక్షిణాఫ్రికా జట్టులో కీలక ఆటగాళ్లు:
డుప్లెసిస్, డికాక్, రబాడ, తాహిర్

వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా జట్టు:
హషీమ్ ఆమ్లా, ఫా డుప్లెసిస్, క్వింటన్ డికాక్, ఇమ్రాన్ తాహిర్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, డ్వెయిన్ ప్రెటోరియస్, తబ్రైజ్ షంసి, వాండెర్ డుసెస్, జేపీ డుమిని, ఐడెన్ మార్‌క్రమ్, క్రిస్ మోరిస్, ఫెలుక్వాయో, కగిసో రబాడ, స్టెయిన్, అన్రిచ్ నోర్జె.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications