
28 ఏళ్ల తర్వాత
అయితే, 28 ఏళ్ల తర్వాత 2011లో ధోని నాయకత్వంలోని టీమిండియా రెండోసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. అంతకాదు ధోని నాయకత్వంలోని టీమిండియా ఎన్నో గొప్ప విజయాలను సాధించింది. ఐసీసీ నిర్వహించే ప్రతిష్టాత్మక టోర్నీలైన చాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్‌లు నెగ్గిన ఏకైక భారత కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు.

ధోనికి ఘనమైన ముగింపు ఇవ్వాలని
అలాంటి ధోనికి ఘనమైన ముగింపు ఇవ్వాలని కోహ్లీ సేన భావిస్తోందట. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు చేరింది. సెమీస్‌తో పాటు ఫైనల్లో కూడా గెలిస్తే ముచ్చటగా ముడోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడుతుంది. ధోనికి కూడా సరైన గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతుందని కోహ్లీసేన ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

2011 ప్రపంచకప్‌లో
2011 ప్రపంచకప్‌లో టీమిండియా ట్రోఫీని నెగ్గి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు ఘనమైన వీడ్కోలు పలికింది. ఇప్పుడు ధోనికి కూడా అలాంటి వీడ్కోలే ఇవ్వాలని కెప్టెన్ కోహ్లీతో పాటు ఆలోచనలో జట్టులోని మిగతా ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.

గెలిస్తో మూడోసారి ట్రోఫీని
ఈ మెగా టోర్నీలో టీమిండియా కేవలం రెండు మ్యాచ్‌లు(సెమీస్, పైనల్) గెలిస్తే మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన తరువాత భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. అమెరికాలోని ఫ్లోరిడా సహా కరేబియన్ దీవుల్లోని గయానా, ట్రినిడాడ్, అంటిగ్వా, జమైకాలల్లో ఈ సిరీస్‌ను నిర్వహించబోతోంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.

ప్రపంచకప్ తర్వాత విండిస్ పర్యటనకు టీమిండియా
దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇదివరకే ఖరారైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు మహేంద్ర సింగ్ ధోనీ అందుబాటులో ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో పాటు బౌలింగ్ ఎటాక్‌ను కూడా కలిగి ఉంది. 2023లో జరగబోయే ప్రపంచకప్‌లో ధోని కూడా ఉండడు. కాబట్టి ఇదే సరైన అవకాశంగా కోహ్లీసేన భావిస్తోంది.


Click it and Unblock the Notifications












