ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్‌కు బయల్దేరిన టీమిండియా

మరో 8 రోజుల్లో మెగా టోర్నీ ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ ప్రపంచకప్ కోసం అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. కొన్ని జట్లు ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లండ్‌కు బయలుదేరాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 4.30 గంటలకు ముంబై విమానాశ్రయంలో 15 మందితో కూడిన టీమిండియా బృందం ఇంగ్లండ్ ఫ్లయిట్ ఎక్కింది.

ఫ్లయిటెక్కిన జాదవ్:
గాయం నుంచి కోలుకున్న కేదార్ జాదవ్ కూడా మిగతా జట్టు సభ్యులతో పాటు ఇంగ్లండ్ పయనమయ్యాడు. టీమిండియా జట్టుతో పాటు కోచ్, సహాయక సిబ్బంది అందరూ ఇంగ్లండ్ ఫ్లయిట్ ఎక్కారు. ఫ్లయిట్ ఎక్కే ముందు ముంబై విమానాశ్రయంలో ఉన్న టీమిండియా ఆటగాళ్ల పోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రోహిత్, పాండ్యా, చాహల్, బుమ్రాలు కూడా పోటోలను తమ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఫేవరేట్‌గా భారత్:
మే 30 నుండి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. మే 30న తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఇక జూన్ 5న దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. అంతకుముందు మే 24 నుంచి వార్మప్ మ్యాచులు జరుగుతాయి. ఈ మెగా టోర్నీలో భారత్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

2019 ప్రపంచకప్ జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications