Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్ గడ్డపై అడుగెట్టిన టీమిండియా

ICC Cricket World Cup 2019: Team India arrive in London for much-awaited ICC World Cup 2019


ప్రపంచకప్‌ టోర్నీ కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు బుధవారం ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టింది. బుధవారం ఉదయం ముంబై నుంచి బయల్దేరిన టీమ్‌ఇండియా.. సుమారు పది గంటల ప్రయాణం తర్వాత లండన్‌కు చేరుకుంది. 15 మంది ఆటగాళ్లతో పాటు మరో 14 మంది సహాయక సిబ్బంది సహా మొత్తం 29 మంది సభ్యుల బృందం ఇంగ్లాండ్‌కు చేరుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రత్యేక బస్సులో హోటల్‌కు:

లండన్‌ విమానాశ్రయం నుండి అందరూ ప్రత్యేక బస్సులో హోటల్‌కు చేరుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సహా అందరు ఆటగాళ్లు హోటల్ లోపలికి వెళుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను బీసీసీఐ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఫొటో షూట్లు:

ఫొటో షూట్లు:

ప్రయాణ నేపథ్యంలో గురువారం భారత జట్టు ప్రాక్టీస్‌ ఏమీ చేయట్లేదు. శుక్రవారం మాత్రం భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. అనంతరం కొందరు ఆటగాళ్లు మీడియా సమావేశంలో పాల్గొంటారు. తర్వాత ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నిర్వహించే వర్క్‌షాప్‌లో జట్టు సభ్యులంతా పాల్గొంటారు. ఆపై ఫొటో షూట్లు కూడా ఉంటాయి.

న్యూజిలాండ్‌తో తొలి ప్రా క్టీస్‌ మ్యాచ్‌:

న్యూజిలాండ్‌తో తొలి ప్రా క్టీస్‌ మ్యాచ్‌:

ఈనెల 25న ఓవల్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో భారత్‌ తమ తొలి ప్రా క్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఆ తర్వాత 28న కార్డిఫ్‌లో రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో ఆడనుంది. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో భారత్‌ తమ ప్రపంచకప్‌ పోరును మొదలు పెడుతుంది. అయితే టోర్నీ మాత్రం ఈ నెల 30న ఆరంభం కానుంది. టోర్నీలో భారత్ టైటిల్‌ ఫేవరెట్‌గా పోటీకి దిగుతున్నది. ధోనీ, కోహ్లీ, రోహిత్, ధావన్, కార్తీక్, షమీ, భువీ, జడేజా లాంటి సీనియర్లకు తోడు జాదవ్‌, బుమ్రా, చాహల్‌, రాహుల్‌, కుల్దీప్‌, శంకర్‌, హార్దిక్‌ లాంటి కుర్రాళ్లతో భారత్ పటిష్టంగా ఉంది.

2019 ప్రపంచకప్‌ జట్టు:

2019 ప్రపంచకప్‌ జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.

Story first published: Thursday, May 23, 2019, 9:06 [IST]
Other articles published on May 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+