'జయవర్ధనే వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.. వాటిని పట్టించుకోను'

శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి, అయితే వాటిని పట్టించుకోను అని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఏంజిలో మాథ్యుస్ అన్నారు. జయవర్ధనే సారథ్యంలో 2011 ప్రపంచకప్‌లో లంక జట్టు ఫైనల్ వెళ్ళింది. ఇక 2015లో జయవర్ధనే రిటైరయ్యాక శ్రీలంక పరిస్థితి దారుణంగా మారింది. కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇవ్వడం, కొందరు ఆటగాళ్లు సస్పెండ్ కావడం వంటి వాటితో లంక జట్టు పూర్వ వైభవాన్ని కోల్పోయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మాథ్యుస్, చండిమాల్‌పై విమర్శలు:
జయవర్ధనే అనంతరం చండిమాల్, తిసెరా పెరీరా, లసిత్ మలింగ, చమర కపుగెదరాలు జట్టు పగ్గాలు చేపట్టినా.. ఫలితం మాత్రం మారలేదు. ఇక ప్రపంచకప్ బాధ్యతలు దిముత్ కరునరత్నేకు అప్పగించారు. అయితే జయవర్ధనే ఆదివారం ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలంక మాజీ కెప్టెన్లు ఏంజిలో మాథ్యుస్, దినేశ్ చండిమాల్‌లు క్రికెట్ రాజకీయాలకు బాధితులయ్యారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఆ వ్యాఖ్యలు పట్టించుకోను:
ఈ వ్యాఖ్యలపై ఏంజిలో మాథ్యుస్ ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఎవరికైనా సొంత అభిప్రాయాలు ఉంటాయి. జయవర్ధనే వ్యాఖ్యలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయితే నేను వాటిని పట్టించుకోను. ప్రపంచకప్‌లో లంక ప్రదర్శనే నాకు ముఖ్యం. జయవర్ధనే విలువైన సూచనలు ఇచ్చి జట్టు విజయానికి కృషి చేయాలి' అని మాథ్యుస్ కోరారు.

ఇంగ్లాండ్ పిచ్‌లు కొత్తేమీ కాదు:
'ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా ఆడాలి. ఒత్తిడికి గురైతే మరింత భారం పెరుగుతుంది. దేశ ప్రయోజనాల కోసం స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించాలి. లంక ఆటగాళ్లకు ఇంగ్లాండ్ పిచ్‌లు కొత్తేమీ కాదు. చాలా మంది ఆటగాళ్లకు ఇక్కడ ఆడిన అనుభం ఉంది. ఇంగ్లాండ్‌లోని పరిస్థితులు ఎలా ఉంటాయో వారికీ తెలుసు. పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యమని' మాథ్యుస్ పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications