ఫైనల్ మ్యాచ్.. ఓవర్ త్రో చూసి గంతులేసిన స్టువర్ట్ బ్రాడ్ (వీడియో)

ఆదివారం లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో.. మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.
ఇంగ్లండ్ లక్ష్య ఛేదనలో ట్రెంట్ బోల్ట్ వేసిన ఆఖరి ఓవర్ నాల్గో బంతి ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్ళింది. బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లడంతో ఇంగ్లండ్‌కు మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. మార్క్ వుడ్ ఒక పరుగు పూర్తి చేసి మరో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా రనౌట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
నాలుగో బంతి బౌండరీ వెళ్లడంతో మ్యాచ్‌ను నాటింగ్‌హామ్ షైర్ కౌంటీ జట్టు సభ్యులతో కలిసి టీవీలో వీక్షిస్తున్న ఇంగ్లాండ్ టెస్ట్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సంబరాలు చేసుకున్నాడు. బంతి బ్యాట్‌కు తాగి ఫోర్ వెళ్ళగానే బ్రాడ్ ఎగిరి గంతులేసాడు. ఈ ఘటనను నాటింగ్‌హామ్ షైర్ సభ్యుడైన భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వీడియో తీశాడు. ఈ వీడియోను బ్రాడ్ తన ట్వీటర్ పేజీలో పోస్ట్ చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications