For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌ సెంచరీ.. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ పరాజయం

ICC Cricket World Cup 2019 : Australia Beat England By 12 Runs In World Cup Warmup Match || Oneindia
ICC Cricket World Cup 2019: Steve Smith Hundred Sets Up Australia Warm-Up Win Over England

మెగా టోర్నీ ప్రపంచకప్‌ హాట్‌ఫేవరెట్‌ ఇంగ్లాండ్‌ పరాజయంను ఎదుర్కొంది. సౌతాంఫ్టన్ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. గత కొన్నాళ్లుగా 400 పైగా పరుగులను చేస్తూ.. 350 పైగా లక్ష్యాలను ఛేదిస్తున్న ఇంగ్లండ్‌కు సొంతగడ్డపై చేదు అనుభవం ఎదురైంది.

వార్నర్‌ మెరుపులు:

వార్నర్‌ మెరుపులు:

టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ (14) త్వరగానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ వార్నర్‌ (55 బంతుల్లో 43; 5 ఫోర్లు), షాన్ మార్ష్‌ (30)తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. అయితే కొద్ది వ్యవధిలో ఈ జోడీ పెవిలియన్ చేరింది.

స్మిత్ సెంచరీ:

స్మిత్ సెంచరీ:

ఈ దశలో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ఉస్మాన్ ఖవాజా (30)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఖవాజా అవుట్ అయినా స్మిత్ బ్యాట్ జులిపించి (102 బంతుల్లో 116; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేసాడు. అలెక్స్ క్యారీ (30) కూడా రాణించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో స్మిత్ అవుట్ అవ్వడంతో.. ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ పేసర్‌ ప్లంకెట్‌ 4 వికెట్లు తీసాడు.

బట్లర్‌ ఆదుకున్నా:

బట్లర్‌ ఆదుకున్నా:

లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ 49.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రాయ్‌ (32), బెయిర్‌స్టో (12) త్వరగానే ఔటయ్యారు. జేమ్స్ విన్స్‌ (64; 76 బంతుల్లో 5 ఫోర్లు), జొస్ బట్లర్‌ (31 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) లు ఆదుకోవడంలో ఇంగ్లాండ్ లక్ష్యం వైపు వెళ్ళింది. ఈ సమయంలో పుంజుకొన్న ఆస్ట్రేలియా బౌలర్లు ఈ జోడీని పెవిలియన్‌ చేర్చారు. ఇక 18 బంతుల్లో 24 పరుగులు అవసరమైన దశలో వోక్స్‌ (40; 3 ఫోర్లు), ప్లంకెట్‌ (19), ఆర్చర్‌ (1)లు ఔటయ్యారు. దీంతో ఇంగ్లండ్‌ ఓడిపోయింది. బెరెన్‌డార్ఫ్‌ (2/43), కేన్‌ రిచర్డ్‌సన్‌ (2/51) రాణించారు.

Story first published: Sunday, May 26, 2019, 10:57 [IST]
Other articles published on May 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+