For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ప్రపంచకప్‌ 2019 అధికారిక గీతం విడుదల

ICC Cricket World Cup 2019, Stand by: Official 2019 ICC World Cup song released

ఐసీసీ ప్రపంచకప్‌ 2019 అధికారిక గీతం 'స్టాండ్‌ బై'ని ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. ఈ పాటను లోరిన్‌ ఆలపించగా.. బ్రిటన్‌కు చెందిన నలుగురు సభ్యుల రుడిమెంటల్‌ బ్యాండ్‌ బృందం సంగీతం సమకూర్చింది. ప్రతి అభిమాని ఈ టోర్నీలో పాల్గొనే తమ జట్ల పట్ల అభిమానాన్ని తెలిపేలా ఈ పాట సాగుతుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

అన్ని స్టేడియాల్లో ఆలపిస్తారు:
మ్యాచ్‌లు జరిగే స్టేడియాల్లో, బ్రిటన్‌లో జరిగే పలు ఈవెంట్ల సందర్భంగా ఈ పాటను ఆలపిస్తారు. 48 మ్యాచ్‌ల పాటు సుదీర్ఘంగా ఈ భారీ టోర్నీని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీక్షించనున్నారు. కాగా ఈ ప్రపంచకప్‌ మెగా టోర్నీ ఈ నెల 30న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతుంది.


మెగా సమరం 46 రోజులు:

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లను సిద్దం చేసింది. ఈ వన్డే ప్రపంచకప్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ ఆతిథ్యమివ్వడం ఇదే ఆరోసారి. మొత్తం 10 జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ 46 రోజుల పాటు జరుగుతుంది. ఇంగ్లండ్‌లోని 11 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జ‌రుగుతాయి.

రౌండ్ రాబిన్ పద్దతిలో:
మ్యాచులు అన్ని రౌండ్ రాబిన్ పద్దతిలో జరగనున్నాయి. ఈ పద్ధతిన ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో రెండు జట్లు (1 vs 4, 2 vs 3) ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇంతకుముందు 1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు.

Story first published: Saturday, May 18, 2019, 11:08 [IST]
Other articles published on May 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+