For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌తో శ్రీలంక పోరు.. లంకకు సవాల్

ICC Cricket World Cup 2019, Sri Lanka vs West Indies: Match Stats and History, Winning, Losing, Tied

శ్రీలంక అనధికారికంగా ప్రపంచకప్‌ సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించినా.. ఎదో మూల చిన్న ఆశ ఉంది. ఆ ఆశను అలాగే ఉంచుకోవాలంటే ఈ రోజు వెస్టిండీస్‌తో జరిగే పోరులో శ్రీలంక తప్పక గెలవాల్సిందే. శ్రీలంక ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు పరాజయాలు, రెండు మ్యాచ్‌లు రద్దవడంతో.. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. వెస్టిండీస్, జూన్ 6న టీమిండియాతో జరిగే మ్యాచ్‌ల్లోనూ తప్పకుండా గెలవాలి. అదే సమయంలో ఇంగ్లండ్‌, బంగ్లా, పాక్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడాలి. ఒకవేళ ఇదే జరిగినా.. రన్ రేట్ మైనస్ (-)లో ఉండడం లంకకు ప్రతికూలత. మరోవైపు వెస్టిండీస్‌ అధికారికంగా సెమీస్‌ రేసు నిష్క్రమించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తప్పకుండా గెలవాలి:

తప్పకుండా గెలవాలి:

టోర్నీలో వరుస ఓటముల తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్‌పై అనూహ్య విజయం సాధించడంతో లంక ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. అయితే దక్షిణాఫ్రికా చేతిలో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉంది. గత మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన కెప్టెన్ కరుణరత్నే ఈసారైన భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఆశిస్తున్నాడు. సీనియర్లు మాథ్యూస్, తిషార పెరెరాతో పాటు కుషాల్ పెరెరా, అవిష్క ఫెర్నాండో, ధనంజయ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో మరోసారి లసిత్ మలింగ కీలకం కానుండగా.. లక్మల్, ఉడాన, డిసిల్వాలు అతనికి సహకారం అందించనున్నారు. అనారోగ్యం కారణంగా నువాన్ ప్రదీప్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

విజయం అందేనా:

విజయం అందేనా:

మరోవైపు పాకిస్థాన్‌పై భారీ విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించిన విండీస్.. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. కొన్ని మ్యాచ్‌ల్లో పోరాడినా.. కీలక సమయాల్లో ఆటగాళ్లు చేతులెత్తేయడంతో విజయం దక్కలేదు. విండీస్ ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించినా.. విజయంతో టోర్నీని వీడాలని చూస్తోంది. గేల్, లెవీస్, హెట్మయర్, హోప్ సహా అందరూ పరుగులు చేయడంలో విఫలమవుతున్నారు. బౌలింగ్లో కాట్రేల్, హోల్డర్, గాబ్రియేల్ రాణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అయినా సమిష్టిగా రాణించి ఓ విజయం సాధిస్తుందో చూడాలి.

రికార్డులు:

రికార్డులు:

ప్రపంచ కప్‌లో విండీస్, లంకలు మొత్తం 8 మ్యాచులు ఆడగా.. శ్రీలంక 3, వెస్టిండీస్ 4 గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది. ప్రస్తుతం చెస్టర్ లీ స్ట్రీట్లో మబ్బులు ఉన్నా వర్షం పడే అవకాశాలు తక్కువ. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది.

Teams Possible XI:

Sri Lanka: Dimuth Karunaratne, Kusal Perera, Avishka Fernando, Kusal Mendis, Angelo Mathews, Jeevan Mendis/ Milinda Siriwardana, Dhananjaya de Silva, Thisara Perera, Isuru Udana, Suranga Lakmal, Lasith Malinga.

West Indies: Chris Gayle, Sunil Ambris, Shai Hope, Nicholas Pooran, Shimron Hetmyer, Jason Holder, Carlos Brathwaite, Fabien Allen, Kemar Roach, Sheldon Cottrell, Oshane Thomas.

1
43682

{headtohead_cricket_8_7}

Story first published: Monday, July 1, 2019, 12:37 [IST]
Other articles published on Jul 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+