For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్

ICC Cricket World Cup 2019, South Africa vs West Indies: West Indies have won the toss and have opted to field

ప్రపంచకప్‌లో భాగంగా సౌథాంప్టన్‌ వేదికగా మరికాసేపట్లో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ మొదలు కానుంది. విండీస్‌ కెప్టెన్ జేసన్ హోల్డర్ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఐడెన్‌ మార్‌క్రమ్‌, హెన్డ్రిక్స్ జట్టులోకి వచ్చారు. మరోవైపు వెస్టిండీస్‌ కూడా రెండు మార్పులు చేసింది. కీమర్ రోచ్, డారెన్ బ్రేవోలను తుది జట్టులోకి తీసుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేదు. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తప్పనిసరి గెలవాలి. ఒకవేళ ఓడితే మాత్రం ప్రోటీన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతే. మరోవైపు వెస్టిండీస్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌ గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడింది. విండీస్ కూడా దక్షిణాఫ్రికాపై గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

ప్రస్తుతం సౌథాంప్టన్‌లో ఎక్కువ చలితో కూడిన వాతావరణం ఉంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. ఈ పిచ్‌పై పరుగుల వరద ఖాయం. అయితే మబ్బు పట్టి ఉండడంతో పిచ్‌ నెమ్మదించే అవకాశాలు కూడా ఉన్నాయి.

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లు ఇప్పటివరకు 61 వన్డేలు ఆడాయి. ఇందులో దక్షిణాఫ్రికా 44 విజయాలు అందుకోగా.. విండీస్‌ 15 మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్‌ టై అయ్యింది. మరో మ్యాచ్‌ రద్దయ్యింది. ప్రపంచకప్‌లో విండీస్‌, దక్షిణాఫ్రికా ఆరుసార్లు తలపడగా.. సఫారీ జట్టు నాలుగుసార్లు, విండీస్‌ రెండుసార్లు గెలిచాయి. గణాంకాల్లో వెస్టిండీస్‌పై సఫారీలకు తిరుగులేని ఆధిపత్యం ఉంది.

Teams:
West Indies: Chris Gayle, Shai Hope(w), Darren Bravo, Nicholas Pooran, Shimron Hetmyer, Jason Holder(c), Carlos Brathwaite, Ashley Nurse, Kemar Roach, Sheldon Cottrell, Oshane Thomas

South Africa: Hashim Amla, Quinton de Kock(w), Faf du Plessis(c), Aiden Markram, Rassie van der Dussen, David Miller, Andile Phehlukwayo, Chris Morris, Kagiso Rabada, Imran Tahir, Beuran Hendricks

Story first published: Monday, June 10, 2019, 15:14 [IST]
Other articles published on Jun 10, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+