Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం

ICC Cricket World Cup 2019, South Africa vs West Indies: South Africa-West Indies match stopped due to rain

ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా 7.3 ఓవర్ల వద్ద ఉండగా.. వర్షం పడటంతో మ్యాచ్‌ను అంపైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్‌ నిలిపివేసే సమయానికి దక్షిణాఫ్రికా 7.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ డుప్లెసిస్‌ 0 (7), ఓపెనర్ డికాక్‌ 17 (21)లు ఉన్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. విండీస్ పేస్ బౌలర్ కాట్రెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ ఐదో బంతికి ఓపెనర్ ఆమ్లా (6) స్లిప్‌లో గేల్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అనంతరం కాట్రెల్‌ వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతికి మర్కరమ్‌ (5) కీపర్‌ షాయ్‌ హోప్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో సఫారీలు 28 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. వెస్టిండీస్‌ బౌలర్‌ కోట్రెల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేదు. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరి గెలవాలి. ఒకవేళ ఓడితే మాత్రం ప్రోటీన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతే. మరోవైపు వెస్టిండీస్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌ గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడింది. విండీస్ కూడా దక్షిణాఫ్రికాపై గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఆరంభంలోనే వికెట్లను కోల్పోయిన ప్రొటీస్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Story first published: Monday, June 10, 2019, 16:29 [IST]
Other articles published on Jun 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+