Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ప్రపంచకప్‌ ఆడతానని డివిలియర్స్‌ ఫోన్‌ చేశాడు.. అప్పటికే సమయం మించిపోయింది'

ICC Cricket World Cup 2019, South Africa vs West Indies: AB de Villiers called me before selection reveals Captain


దక్షిణాఫ్రికా విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ప్రపంచకప్‌ జట్టు ఎంపికకు ముందు రోజు రాత్రి మళ్లీ ఆడతానని నాకు ఫోన్‌ చేశాడు అని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌ తెలిపారు. ప్రపంచకప్‌లో బాగంగా దక్షిణాఫ్రికా సోమవారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. అనంతరం డుప్లెసిస్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆడతానని ఫోన్‌ చేశాడు:

ఆడతానని ఫోన్‌ చేశాడు:

డుప్లెసిస్‌ మాట్లాడుతూ... 'ప్రపంచకప్ జట్టు ఎంపికకు ముందు రోజు రాత్రి డివిలియర్స్‌ ఫోన్‌ చేశాడు. ప్రపంచకప్‌లో ఆడాలని ఉంది. అవకాశం ఉందా' అని అడిగాడు. 'ఇప్పటికే జట్టు మేనేజ్మెంట్ ఆటగాళ్ల విషయంలో ఓ అవగాహనకు వచ్చింది. అయినా కోచ్‌, సెలెక్టర్లతో మాట్లాడి చూస్తాను' అని నా స్నేహితుడికి చెప్పా. 'ఉదయం జట్టు మేనేజ్మెంట్ సభ్యులతో విషయం చెపితే.. ఇప్పటికే ఆలస్యం అయింది, ఇప్పుడు డివిలియర్స్‌ను చేర్చుకోవడం అసాధ్యమని తెలిపారు' అని డుప్లెసిస్‌ చెప్పారు.

ఎలాంటి విభేదాలు లేవు:

ఎలాంటి విభేదాలు లేవు:

'ఇదొక చిన్న విషయం. దీంతో మా మద్య ఎలాంటి విభేదాలు లేవు. మా స్నేహానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రపంచకప్‌ జట్టు ఎంపిక విషయంలో చాలా వివాదాలు జరిగాయి. అయితే అవి తమ జట్టుపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. జట్టులో ఏం జరగుతుందో ఆటగాళ్లందరికీ తెలుసు. ఆ విషయంను తాను ఎప్పుడో మరిచిపోయాను. ఇపుడు విజయలపైనే దృష్టి పెట్టా' అని డుప్లెసిస్‌ తెలిపారు.

నిరాశ చెందాం:

నిరాశ చెందాం:

'వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు కావడం చిరాకుగా ఉంటుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. కానీ వాతావరణం మన చేతుల్లో ఉండదు. మ్యాచ్‌ను వికెట్లు కోల్పోకుండా ప్రారంభించాలి అనుకున్నాం. ప్రత్యర్థి జట్టులో మెరుగైన బౌలర్లు ఉండడంతో తొందరగా వికెట్లు కోల్పోయాం. వర్షం పడే సందర్భాల్లో రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం సులువు. 30-35 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యపడలేదు. నిరాశ చెందాం. లుంగీ వచ్చే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు' అని డుప్లెసిస్‌ చెప్పుకొచ్చారు.

అద్భుతం జరగాల్సిందే:

అద్భుతం జరగాల్సిందే:

దక్షిణాఫ్రికా జట్టుకు వెస్టిండీస్‌తో మ్యాచ్ చాలా కీలకం. కానీ.. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైంది. మ్యాచ్‌ రద్దవడంతో అంపైర్లు ఇరు జట్లకూ చెరో పాయింట్‌ ఇచ్చారు. వరణుడు అడ్డుపడడంతో ప్రొటీస్ సెమీస్‌ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. సెమీస్‌ చేరాలంటే 12 పాయింట్లు కావాలి. మిగిలిన ఐదు మ్యాచుల్లో నెగ్గినా.. 11 పాయింట్లు ప్రొటీస్ ఖాతాలో చేరుతాయి. ప్రొటీస్ సెమీస్‌ చేరాలంటే.. ఐపీఎల్-12 మాదిరిగా ఏదైనా అద్భుతం జరగాల్సిందే.

Story first published: Tuesday, June 11, 2019, 11:38 [IST]
Other articles published on Jun 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+