For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్మప్ మ్యాచ్: దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్

ICC Cricket World Cup 2019: South Africa vs West Indies, 5th Warm-up game, West Indies opt to bowl

వరల్డ్‌కప్ సన్నాహాకంలో భాగంగా వెస్టిండీస్ ప్రాక్టీస్ మ్యాచ్‌కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్.. దక్షిణాఫ్రికాతో తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడుతుంది. బ్రిస్టల్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ప్రోటీస్ బ్యాటింగ్‌కు దిగింది.

ఈ మెగా టోర్నీలో శ్రీలంకతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 87 పరుగులతో భారీ విజయం సాధించి మంచి ఊపుమీదుంది. ఆమ్లా, డుప్లెసిస్ తొలి మ్యాచ్‌లో నిరూపించుకోగా.. మార్కరం, డుమిని, మిల్లర్ గాడిన పడాల్సి ఉంది. మరోవైపు వెస్టిండీస్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లాండ్ గడ్డపై బోణీ కొట్టాలని చూస్తోంది. ఈ నెల 28న కివీస్ జట్టుతో వెస్టిండీస్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడనుంది.

టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి.

Teams:

South Africa:
Hashim Amla, Aiden Markram, Faf du Plessis(c), Rassie van der Dussen, David Miller, Jean-Paul Duminy, Quinton de Kock(w), Andile Phehlukwayo, Dwaine Pretorius, Chris Morris, Kagiso Rabada, Lungi Ngidi, Imran Tahir, Dale Steyn, Tabraiz Shamsi.

West Indies:
Chris Gayle, Evin Lewis, Darren Bravo, Shimron Hetmyer, Nicholas Pooran(w), Ashley Nurse, Andre Russell, Jason Holder(c), Carlos Brathwaite, Shai Hope, Fabian Allen, Kemar Roach, Oshane Thomas, Shannon Gabriel, Sheldon Cottrell.

Story first published: Sunday, May 26, 2019, 15:45 [IST]
Other articles published on May 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+