న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌: కోహ్లీసేన ఇంత ఆలస్యంగా తొలి మ్యాచ్ ఆడటానికి కారణమిదే!

ICC World Cup 2019:This Is The Reason Why Teamindia Late Entry In World Cup ?
ICC Cricket World Cup 2019: South Africa vs India: Why India Are Playing First World Cup Match So Late, Twitter Trolls

ప్రపంచకప్‌లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. ఒక్క భారత్ తప్ప ఇప్పటి వరకు అన్ని జట్లు తమ తొలి మ్యాచ్ ఆడాయి. ఇంకొన్ని జట్లయితే ఏకంగా రెండు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు రెండు మ్యాచులు ఆడగా.. ఈ రోజు అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్ జట్లు రెండో మ్యాచ్ ఆడుతున్నాయి. భారత్ మాత్రం ఒక్క మ్యాచ్ ఆడలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

విశ్రాంతి కావాలని:

విశ్రాంతి కావాలని:

భారత్‌ బుధవారం దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. భారత్‌కు ఇది తొలి మ్యాచ్‌ కాగా.. దక్షిణాఫ్రికాకు మూడో మ్యాచ్ కావడం గమనార్హం. అయితే ప్రపంచకప్‌లో భారత్ తొలి మ్యాచ్‌ ఆలస్యంకు అసలు కారణం బీసీసీఐనే అట. ఐపీఎల్ 2019 సీజన్‌తో దాదాపు నెలన్నర పాటు టీమిండియా క్రికెటర్లు విశ్రాంతి లేకుండా ఆడారు. అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఆడారు. తీరిక లేని క్రికెట్ ఆడిన నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని బీసీసీఐ భావించింది.

ఐసీసీని కోరిన బీసీసీఐ:

ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని బీసీసీఐ స్వయంగా ఐసీసీని కోరింది. దీంతో టోర్నీ మొదలైన వారం తర్వాత టీమిండియా తొలి మ్యాచ్ ఆడేలా ఐసీసీ షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ సమయంను టీంఇండియా ఆటగాళ్లు బాగానే ఉపయోగించుకున్నారు. ఈ సమయంలో గాయపడిన ఆటగాళ్లు కూడా ఫిట్‌నెస్ సాధించగా.. మరికొందరేమో నెట్స్ లో సాధన చేశారు. ఏదేమైనా ఈ ఆలస్యం మనకు మేలు చేసింది.

ఇంకెప్పుడ్రా మన మ్యాచ్‌:

తొలి మ్యాచ్‌ ఆలస్యంపై అభిమానులు సోషల్‌ మీడియాలో జోకులు పేల్చుతున్నారు. ఫన్నీ మీమ్స్‌ పోస్ట్ చేసి కామెంట్లు కురిపిస్తున్నారు. 'అబ్బా.. టీంఇండియా మ్యాచ్ ఇంకెప్పుడు' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'ఇంకెప్పుడ్రా మన మ్యాచ్‌' అని మరో అభిమాని ట్వీటాడు. 'కోడి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలైనా భారత్‌ మ్యాచ్‌ ఆడేటట్టు లేదు', 'ఆటగాళ్లంతా డగౌట్‌లో కూర్చుని అస్థిపంజరాలైనా ఐసీసీ మ్యాచ్‌ ఆడించేటట్టు' లేదని కామెంట్‌ చేస్తున్నారు.

Story first published: Tuesday, June 4, 2019, 15:43 [IST]
Other articles published on Jun 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X