న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ.. ప్రముఖుల ప్రశంసలు

ICC Cricket World Cup 2019 : Senior Indian Cricketers Praises Team India For The Amazing Victory
ICC Cricket World Cup 2019: South Africa vs India: Special Knock - Twitter Lauds Rohit Sharma for Match-Winning Century

ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ 'హిట్‌ మ్యాన్‌' రోహిత్‌ శర్మ (122 నాటౌట్‌; 144బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి విజయం నమోదుకావడంతో టీమిండియా, రోహిత్‌ శర్మపై ట్విటర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

క్రికెట్‌ వరల్డ్‌ కప్‌:

ప్రపంచకప్‌లో ఓపెనర్ రోహిత్‌ శర్మ నుండి అద్భుత ఇన్నింగ్స్ చూసాం. టీమిండియా ఆరంభం అదిరింది.

వీరేంద్ర సెహ్వాగ్‌:

రోహిత్‌ శర్మ నిశ్బబ్దమైన శతకం చేసాడు. మ్యాచ్‌ పరిస్థితిని గొప్పగా అర్థం చేసుకున్నాడు. శబాష్ రోహిత్. బుమ్రా, చహల్ మ్యాచ్ మొత్తం ప్రెసర్ పెంచారు. ప్రపంచకప్‌లో టీమిండియా మంచి బోణి కొట్టింది.

హర్భజన్‌ సింగ్‌:

రోహిత్‌ గొప్పగా ఆడావు. అద్భుత శతకం. టీమిండియా మంచి ఆరంభం. గ్రేట్ బౌలింగ్. బుమ్రా, చహల్ బాగా ఆడారు.

ఇర్ఫాన్‌ పఠాన్‌:

రోహిత్ స్పెషల్‌ ఇన్నింగ్స్‌ ఇది. ఇంగ్లాండ్ పిచ్‌లపై ప్రతి జట్టుకు ఓపెనర్లు చాలా కాలకం. ఇది మరోసారి రోహిత్‌ చూపించాడు. అక్కడి పరిస్థితులకు ఓపెనర్ల శతకాలు చాలా అవసరం.

సురేశ్‌ రైనా:

బౌలర్లు చాహల్‌, బుమ్రా బాధ్యతాయుతమైన ప్రదర్శన చేశారు. టాప్‌ ఆర్డర్‌ విఫలమయినా.. రోహిత్‌ శతకం టీమిండియాకు కలిసొచ్చింది. టీమిండియాకిది ఆత్మ విశ్వాసంతో కూడిన ఆరంభం.

Story first published: Thursday, June 6, 2019, 12:26 [IST]
Other articles published on Jun 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X