డికాక్ సూపర్ క్యాచ్.. ఆశ్చర్యంలో కోహ్లీ (వీడియో)

ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభమైన 12వ ఎడిషన్ వన్డే ప్రపంచకప్ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచుతుంది. తొలుత మ్యాచ్‌లు కొన్ని ఏకపక్షంగా సాగడంతో నిరాశకు గురైన అభిమానులు.. టోర్నీ గడుస్తున్నా కొద్దీ రసవత్తరంగా సాగుతుండడంతో మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాట్స్‌మన్ పరుగులు చేస్తుండగా.. బౌలర్లు వికెట్లతో చెలరేగుతున్నారు. ఇక ఫీల్డర్లు, వికెట్ కీపర్‌లు కూడా తమ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
క్యాచ్ ఆఫ్ ది సెంచరీ:
దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకోగా.. వెస్టిండిస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ స్టన్నింగ్ క్యాచ్‌తో పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను వెనక్కి పంపాడు. అయితే స్టోక్స్ పట్టిన క్యాచ్‌ని మాజీ క్రికెటర్లు 'క్యాచ్ ఆఫ్ ది సెంచరీ'గా అభివర్ణిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ సూపర్ క్యాచ్‌తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెవిలియన్ పంపాడు. డికాక్ సూపర్ క్యాచ్ అందుకోవడం ప్రపంచకప్‌లో రెండోసారి.
సూపర్ క్యాచ్:
ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడింది. ఛేదనలో 16వ ఓవర్ మూడో బంతిని సఫారీ పేస్ బౌలర్ ఫెలుక్వాయో వేయగా.. బంతి కాస్తా బౌన్స్ అయి కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. స్లిప్‌లో ఉన్న ఆమ్లా, కీపర్ డికాక్ మధ్య నుంచి బంతి వెళుతుండగా.. ఒక్కసారిగా కుడివైపునకు గాల్లోకి డైవ్ చేసి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 34 బంతుల్లో 18 పరుగులు చేసాడు.

స్టన్నింగ్ క్యాచ్:
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా డీకాక్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ (42; 30 బంతుల్లో 9 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. క్రిస్ మోరిస్ వేసిన 12 ఓవర్ నాలుగో బంతిని సౌమ్య సర్కార్ పుల్ చేయబోయాడు. బంతి కాస్త గ్లౌవ్‌ను తాకి అక్కడే గాల్లోకి లేచింది. వికెట్లకు దూరంగా ఉన్న డీకాక్.. పరుగెత్తూకుంటూ వచ్చి బంతి కింది పడే సమయంలో డైవ్ చేసి ఒడిసి పట్టాడు. దీంతో అర్ధ సెంచరీకి చేరువలో ఉన్న సౌమ్య నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్ ఆ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది.

టీమిండియా బోణీ:
ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ (122 నాటౌట్; 144బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీ చేసాడు. రాహుల్ (26), ధోనీ (34)లు రాణించారు. అంతకుముందు దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. క్రిస్ మోరిస్ (42), డుప్లెసిస్ (38), ఫెహ్లుక్వోయో (34), డేవిడ్ మిల్లర్ (31), రబడా(31 నాటౌట్) రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications