Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌ తొలి మ్యాచ్.. నాలుగో స్థానం రాహుల్‌దేనా?

ICC Cricket World Cup 2019 : KL Rahul Primed To Bat At Position Four Ahead Of Tournament Opener
ICC Cricket World Cup 2019: South Africa vs India: KL Rahul is right choice for No.4 spot in Indias World Cup squad

గత కొంత కాలంగా భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లోని నాలుగో స్థానంపై తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ స్థానంలో టీమిండియా చాలా మందినే ప్రయోగించింది. మనీష్ పాండే, అంబటి రాయుడు, దినేష్‌ కార్తిక్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ ఇలా చాలా మందినే పరీక్షించారు. కొన్ని మ్యాచ్‌లలో అయితే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా వచ్చాడు. అయితే ధోనీ మ్యాచ్ పరిస్థితిని బట్టి రంగంలోకి దిగుతాడు. చివరకు నాలుగో స్థానంలో తెలుగు తేజం అంబటి రాయుడు కుదురుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రాయుడు విఫలం:

రాయుడు విఫలం:

ఆస్ట్రేలియా సిరీస్‌, ఐపీఎల్-12లో రాయుడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదే సమయంలో పంజాబ్ తరపున పరుగుల వరద పారిస్తూ కేఎల్‌ రాహుల్‌ ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచకప్‌ జట్టు నాలుగో స్థానంలో విజయ్ శంకర్, కేఎల్‌ రాహుల్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇద్దరు రేసులో ఉన్నా.. నం.4లో ఎవరు ఆడుతారో అని కెప్టెన్ కోహ్లీ, కోచ్ స్పష్టత ఇవ్వలేదు.

రాహుల్‌ మెరుపు శతకం:

నం.4లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు విజయ్ శంకర్. అయితే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లకు ముందు శంకర్ గాయపడడంతో.. తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ అవకాశం దక్కించుకున్నాడు. మ్యాచ్‌లో రాహుల్‌ 10 బంతులు ఆడి 6 పరుగులు చేసి బోల్డ్ అయ్యాడు. రెండవ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో 94 బంతుల్లో (108; 99 బంతుల్లో 12×4, 4×6) మెరుపు శతకం చేసాడు. మరోవైపు శంకర్ (2) విఫలమయ్యాడు.

 నెట్స్‌లో ప్రాక్టీస్:

నెట్స్‌లో ప్రాక్టీస్:

ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. తొలి మ్యాచ్‌కు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్స్‌లో శ్రమిస్తున్నారు. సెంచరీ చేసి మంచి ఊపుమీదున్న రాహుల్ కూడా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. డిఫెన్స్, స్ట్రోక్స్‌, స్ట్రయిట్ షాట్స్ ఆడుతూ రాహుల్‌ మంచి టచ్ లో ఉన్నాడు. మరోవైపు ఎంఎస్ ధోనీ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసాడు.

నాలుగో స్థానం రాహుల్‌దే:

నాలుగో స్థానం రాహుల్‌దే:

రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడనే సంకేతాలు వచ్చాయి. ఇక నాలుగో స్థానంలో రాహుల్‌ను ఆడించాలని కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో పాటు టీం మేనేజిమెంట్ భావిస్తోందని సమాచారం తెలుస్తోంది.

Story first published: Tuesday, June 4, 2019, 11:58 [IST]
Other articles published on Jun 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+