కోహ్లీ ఫొటోను ఐసీసీ షేర్.. మండిపడుతున్న నెటిజన్లు

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేసిన ఐసీసీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడింది. భారత్ మ్యాచ్‌కు ముందు ఐసీసీ కోహ్లీ స్కెచ్ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో కోహ్లీ ఓ చేతిలో బ్యాట్, మరో చేతిలో బాల్ పట్టుకుని.. 'కింగ్' డ్రెస్‌లో సింహాసనంపై కూర్చున్నాడు. ఈ పోటీలో టీమిండియా గెలిచిన ప్రపంచకప్ సంవత్సరాలు కూడా ఉన్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఐసీసీ స్కెచ్ బాగుంది:
ప్రస్తుతం ఐసీసీ పోస్ట్ చేసిన ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరేమో 'కింగ్ కోహ్లీ'కి తగ్గట్టు ఐసీసీ స్కెచ్ బాగుంది అని ప్రశంశించారు. కోహ్లీని గౌరవించడం బాగుంది అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచక్‌పలో 10 జట్లు పాల్గొంటుంటే.. ఒక టీమ్ కెప్టెన్‌ను మాత్రమే ఇలా పోస్ట్ చేయడం బాగోలేదని మండిపడుతున్నారు.

బీసీసీఐ కంటే ఎక్కువ చేస్తోంది:
ఐసీసీ టీమిండియా అభిమానిలా వ్యవహరిస్తోందని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. 'ప్రపంచకప్‌లో కేవలం భారత్ మాత్రమే ఆడటంలేదు', 'ఐసీసీ భారత ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ కంటే ఎక్కువ చేస్తోంది', 'ఐసీసీని బీసీసీఐ సొంతం చేసుకుంది' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

టీమిండియా బోణీ:
ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ (122 నాటౌట్; 144బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీ చేసాడు. రాహుల్ (26), ధోనీ (34)లు రాణించారు. అంతకుముందు దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. క్రిస్ మోరిస్ (42), డుప్లెసిస్ (38), ఫెహ్లుక్వోయో (34), డేవిడ్ మిల్లర్ (31), రబడా(31 నాటౌట్) రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications