స్టెయిన్ టోర్నీకి దూరమవడం బాధాకరం.. అతను త్వరగా కోలుకోవాలి'

ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా 'స్పీడ్ గన్' డేల్ స్టెయిన్ దూరమవ్వడం చాలా బాధాకరం. టోర్నీ నుంచి స్టెయిన్ నిష్క్రమించడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. టీమిండియా ఈ రోజు దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
భుజానికి గాయం కారణంగా స్టెయిన్ ఈ ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. మంగళవారం మీడియాతో ముచ్చటించిన కోహ్లీ.. తన జట్టు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) సహచర ఆటగాడు స్టెయిన్ గురించి మాట్లాడాడు. 'స్టెయిన్ టోర్నీకి దూరమవడం చాలా బాధాకరం. స్టెయిన్ చాలా మంచి ఆటగాడు. బ్యాట్స్‌మన్‌కు గట్టి పోటీ ఇచ్చే బౌలర్. అతని బౌలింగ్‌లో నేను ఎన్నోసార్లు ఆడాను. టోర్నీలో అతడి నుంచి స్నేహపూర్వక పోటీ ఎదురవుతుందని ఆశించాను. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు' అని కోహ్లీ తెలిపారు.
'మేమిద్దరం చాలా కాలంగా స్నేహితులం. అతనెప్పుడూ స్ఫూర్తి కలిగించే వ్యక్తి. స్టెయిన్‌ను కొన్ని విషయాల్లో ఆదర్శంగా తీసుకోవచ్చు. అతను చాలా దృఢమైన వ్యక్తి. ఈ గాయాలు అతడినేమీ చేయలేవు. అతను టోర్నీ నుంచి నిష్క్రమించడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అని కోహ్లీ అన్నారు.
స్టెయిన్ గత కాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్‌లో బెంగళూరుకు కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. అనంతరం జట్టు యాజమాన్యం పిలుపు మేరకు చికిత్స నిమిత్తం దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్ళాడు. ప్రపంచకప్ వరకు స్టెయిన్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని భావించారు. కానీ గాయం తీవ్రతలో ఎలాంటి మార్పు రాకపోవడంతో టోర్నీకి దూరమయ్యాడు. వార్మప్ మ్యాచులతో సహా తొలి రెండు మ్యాచులు కూడా స్టెయిన్ ఆడలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications