న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

ICC Cricket World Cup 2019: South Africa vs Bangladesh, South Africa have won the toss and have opted to field

ప్రపంచకప్‌లో భాగంగా ఓవల్ మైదానం వేదికగా మరికొద్ది సేపట్లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో టాస్ గెలిచిన ప్రతి కెప్టెన్ బౌలింగ్ ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. భార‌త్‌తో వార్మ‌ప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండ‌గా గాయ‌ప‌డిన బంగ్లా కెప్టెన్ మ‌ష్ర‌ఫే మొర్త‌జా మ్యాచ్ ఆడుతున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు దూర‌మైన సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ బంగ్లాతో మ్యాచ్‌లోనూ బెంచ్‌కే ప‌రిమితం అయ్యాడు. గాయపడిన ఆమ్లా స్థానంలో మిల్లర్ జట్టులోకి వచ్చాడు. ఇక క్రిస్ మోరిస్ కూడా తుది జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ చేతిలో 104 ప‌రుగుల తేడాతో ఓడిన దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌కు స‌న్న‌ద్ధ‌మైంది. అయితే ప్రమాదకర జ‌ట్టుగా ముద్ర‌ప‌డిన బంగ్లాదేశ్‌తో సఫారీ జట్టు ఎలా ఆడుతుందోన‌ని ఆస‌క్తిక‌రంగా మారింది. మరోవైపు మెగాటోర్నీలో తొలిమ్యాచ్‌ ఆడుతున్న బంగ్లా జట్టు శుభారంభం కోసం ప్రయత్నిస్తోంది.

1
43648

{headtohead_cricket_6_10}

జట్లు:
దక్షిణాఫ్రికా:
ఐడెన్‌ మార్‌క్రమ్‌, క్వింటన్ డికాక్‌ (వికెట్ కీపర్), ఫా డుప్లెసిస్‌ (కెప్టెన్), వాండెర్‌ డుసెస్‌, జేపీ డుమిని, డేవిడ్‌ మిల్లర్‌, ఫెలుక్వాయో, క్రిస్‌ మోరిస్‌, కగిసో రబాడ, ఇమ్రాన్ తాహిర్‌, లుంగి ఎంగిడి.

బంగ్లాదేశ్‌:
తమిమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్‌ఫిజుర్‌ రహీమ్‌ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, మోహ్మద్‌ మిథున్‌, మొసాద్దెక్‌ హుసెన్‌, మొహమ్మద్‌ సైఫుద్దీన్‌, మెహిదీ హసన్‌, మష్రాఫే మోర్తాజ (కెప్టెన్‌), ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌.

Story first published: Sunday, June 2, 2019, 15:01 [IST]
Other articles published on Jun 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X