Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌కు కామెంటేటర్ల ఎంపిక.. భారత్‌ నుంచి ముగ్గురు

ICC Cricket World Cup 2019 : Sourav Ganguly Among 3 Indian Commentators For Cricket World Cup 2019 !
ICC Cricket World Cup 2019: Sourav Ganguly among 3 Indian commentators for Cricket World Cup 2019

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మెగా టోర్నీ ప్రపంచకప్‌ 2019 ప్రారంభం కానుంది. ఈ సమరం కోసం అన్ని జట్లు ఇప్పటికే తమ 15 మందితో కూడిన జట్లను ప్రకటించాయి. తాజాగా ఇక సీజన్‌కు సంబంధించిన కామెంటేటర్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గురువారం విడుదల చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

మొత్తం 24 మందితో కూడిన కామెంటరీ బృందాన్ని ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రపంచకప్‌లో పాల్గొంటున్న ఆఫ్ఘానిస్తాన్ దేశానికి చెందిన ఏ ఒక్క కామెంటేటర్‌ చోటు దక్కించుకోలేదు. అయితే భారత్‌ నుంచి మాత్రం ముగ్గురు కామెంటేటర్లు ఎంపికయ్యారు. హర్షా భోగ్లే, సంజయ్‌ మంజ్రేకర్‌, సౌరవ్‌ గంగూలీలకు చోటు దక్కంది. కుమార సంగక్కర, గ్రేమ్ స్మిత్, బ్రెండన్ మెకల్లమ్, మైఖేల్ క్లార్క్ వంటి మాజీ కెప్టెన్లు కూడా ఉన్నారు.

ఈ జాబితాలో అత్యధికంగా ఇంగ్లండ్‌ నుంచి నలుగురు కామెంటేటర్లు చోటు దక్కించుకున్నారు. భారత్‌, న్యూజిలాండ్‌ నుంచి ముగ్గురు.. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ నుంచి ఇద్దరు.. బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. ముగ్గురు మహిళా కామెంటేటర్లు కూడా చోటు దక్కించుకున్నారు.

కామెంటేటర్ల జాబితా:

నాసీర్‌ హుస్సేన్‌, మైకేల్‌ క్లార్క్‌, ఇయాన్‌ బిషప్‌, సౌరవ్‌ గంగూలీ, మిలేనీ జోన్స్‌, కుమార సంగక్కరా, మైకేల్‌ అథర్టన్‌, అలిసన్‌ మిచెల్‌, బ్రెండన్‌ మెకల్లమ్‌, గ్రేమ్‌ స్మిత్‌, వసీం అక్రమ్‌, షాన్‌ పొలాక్‌, మైఖేల్‌ స్లేటర్‌, మార్క్‌ నికోలస్‌, మైఖేల్‌ హోల్డింగ్‌, ఇషా గుహ, పొమ్మి ఎంబాగ్వా, సంజయ్‌ మంజ్రేకర్‌, హర్షా భోగ్లే, సిమోన్‌ డౌల్‌, ఇయాన్‌ స్మిత్‌, రమీజ్‌ రాజా, అధర్‌ అలీ ఖాన్‌, ఇయాన్‌ వార్డ్‌.

Story first published: Friday, May 17, 2019, 13:04 [IST]
Other articles published on May 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+