బాబర్‌కు అక్తర్ సూచన.. విరాట్ కోహ్లీలా ఆడడం నేర్చుకో

టీమిండియా కెప్టెన్ 'పరుగుల మెషిన్' విరాట్ కోహ్లీని ఆరాధించడమే కాదు అతడిలా బ్యాటింగ్ చేయడం నేర్చుకోవాలి అని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌కు సూచించాడు. విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసినా.. లక్ష్యాన్ని ఛేదించడంలోనైనా కోహ్లీ ఏమాత్రం తడబడడు. క్రీజులోకి వచ్చాడంటే స్కోర్ బోర్డ్ ముందుకు సాగాల్సిందే. కోహ్లీని ఎందరో యువ ఆటగాళ్లు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. క్రికెట్ ఆడుతున్నవారు కూడా కోహ్లీని ఆరాధిస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారీ స్కోర్లు చేయడంలో విఫలం:
పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ కూడా విరాట్ కోహ్లీని ఆరాధిస్తాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో బాబర్ కీలకమైన పరుగులు సాధిస్తున్నాడు కానీ భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. హాఫ్ సెంచరీల అనంతరం పెవిలియన్ చేరుతున్నాడు. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో కూడా 69 పరుగులు చేసి 42వ ఓవర్లో ఔట్ అయ్యాడు. తాజాగా అక్తర్ తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడాడు.

కోహ్లీలా ఆడడం నేర్చుకో:
బాబర్ నువ్వు విరాట్‌ను ఆరాథ్య ఆటగాడిగా బావిస్తున్నావ్. కోహ్లీని ఆరాధించడమే కాదు అతడిలా బ్యాటింగ్ చేయడం నేర్చుకోవాలి. జట్టు క్లిష్టమైన పరిస్థితుల్లో కోహ్లీ ఎన్నో పరుగులు చేశాడు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సింగిల్స్ ఎలా చేయాలో విరాట్ నుంచి నేర్చుకో. కోహ్లీలా పరిపూర్ణ ఆటగాడిలా ఎదగాలి. ఒకసారి రోహిత్, విలియంసన్, కోహ్లీలను గమనిస్తే.. హాఫ్ సెంచరీ అనంతరం వేగం పెంచుతారు. వారి నుండి అది నేర్చుకోవాలి. ఎక్కువ షాట్లు ఆడాలి' అని అక్తర్ యూట్యూబ్ చానల్ ద్వారా సలహా ఇచ్చాడు. పాక్ తన తదుపరి మ్యాచ్ పటిష్ట న్యూజిలాండ్‌తో ఆడనుంది.

ఇదంతా జరిగే పనేనా:
భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం పాకిస్థాన్ తిరిగి పుంజుకుంది. దక్షిణాఫ్రికాను చిత్తుచేసి ప్రపంచకప్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకున్నది. పాక్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచింది. మూడింట్లో ఓడిపోగా.. ఓ మ్యాచ్ రద్దైంది. దీంతో ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇక న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సిన మ్యాచ్‌ల్లో పాక్ తప్పక గెలవాల్సి ఉంటుంది. అన్నీ గెలిస్తే మొత్తం 11 పాయింట్లతో నాకౌట్ చేరే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో ఇంగ్లాండ్ ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చెందితేనే పాకిస్థాన్‌కు అవకాశముంటుంది. పాక్ అన్నీ మ్యాచ్‌లు గెలవాలి, ఇంగ్లాండ్ ఓడిపోవాలి. ఇదంతా జరిగే పనేనా?. చూద్దాం మరి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications