దూరం నుంచి పరిగెత్తుకు వచ్చి షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే క్యాచ్ (వీడియో)

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్ ఆటగాడు షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పట్టిన క్యాచ్‌తో పోలిస్తే ఈ క్యాచ్ ఎంతమాత్రం తీసిపోదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 44వ ఓవర్ రెండో బంతిని థామస్ ఫుల్ లెంగ్త్‌లో వికెట్లకు దూరంగా వేయగా స్మిత్ లాంగ్ లెగ్‌లోకి భారీ షాట్ ఆడాడు. అంతా దానిని సిక్స్ అని భావించారు.
బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న షెల్డన్
అయితే, అదే సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న షెల్డన్ కాట్రెల్ పరుగెత్తుకు వచ్చి ఎడమ చేత్తో దానిని ఒడిసిపట్టేశాడు. అయితే, బౌండరీకి అతి సమీపంలో ఉండటంతో చురుగ్గా స్పందించి బంతిని గాల్లోకి విసిరేశాడు. బౌండరీ వెలుపలికి వెళ్లి, తిరిగి మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు.

ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఐసీసీ
ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ జట్టులో కౌల్టర్-నైల్(92; 60 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు), మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (103 బంతుల్లో 73; 7 ఫోర్లు), అలెక్స్ క్యారీ (55 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు.

15 పరుగుల తేడాతో వెస్టిండిస్ ఓటమి
విండిస్ బౌలర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్ (3/67) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో షై హోప్ (105 బంతుల్లో 68; 7 ఫోర్లు), నికొలస్ పూరన్ (36 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ హోల్డర్ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) రాణించినా విండిస్ 9 వికెట్లకు 273 పరుగులే చేయగలిగింది. దీంతో ఆస్ట్రేలియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications