షాహిన్ అఫ్రిది: పాకిస్థాన్ అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రం

హైదరాబాద్: షాహిన్ అఫ్రిది.... 2018లో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌తో వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్. వయసు 19 ఏళ్లు.. ఎత్తు 6 అడుగుల 6 అంగుళాలు. చూడటానికి సన్నగా కనిపిస్తాడు కానీ బంతి సంధించాడంటే కంటికి కూడా కనిపించదు. ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ ప్రధాన ఆయుధం ఇతడే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

పేస్ బౌలర్లలో అతి పిన్న వయస్కుడు
పాకిస్థాన్ జట్టు పేస్ బౌలర్లలో అతి పిన్న వయస్కుడు. కానీ వికెట్లు తీయడంలో ముందు వరుసలో ఉంటాడు. 2004లో పాకిస్థాన్ టెస్టు జట్టులో చోటు సంపాదించిన రియాజ్ అఫ్రిదికి స్వయాన సోదరుడు. అన్న క్రికెటర్ కావడంతో తమ్ముడు కూడా క్రికెట్‌పై ఎంతో మక్కువ పెంచుకున్నాడు.

పేస్ బౌలర్లలో అతి పిన్న వయస్కుడు
క్వైయిద్ ఎ అజాం టోర్నీలో షాహిన్ అఫ్రిది ఆడిన తొలి మ్యాచ్‌లో 39 పరుగులకే 8 వికెట్లు పడగొట్టాడు. ఇక, 2018లో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో 5 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు. అతడి రనప్ వైవిధ్యభరితంగా ఉండటంతో 2018లో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు.

రివర్స్ స్వింగ్ బంతులు వేయడంతో దిట్ట
స్లో బంతులు, రివర్స్ స్వింగ్ బంతులు వేయడంతో దిట్ట అయిన షాహిన్ అఫ్రిది పాకిస్థాన్ ప్రిమియర్ లీగ్‌లో లాహోర్ క్వాండర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అభిమానులు ముద్దుగా పాకిస్థాన్ మిచెల్ స్టార్క్ అని పిలుచుకుంటారు. అలాంటి షాహిన్ అఫ్రిది ఈ వరల్డ్‌కప్‌లో పాక్ విజయాల్లో కీలకపాత్ర పోషించాలని కోరుకుంటున్నాడు.

జూన్ 16న ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్
వరల్డ్‌కప్ మెగా టోర్నీ కోసం సర్వం సిద్ధమైంది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. టోర్నీలో భాగంగా విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్ 5న సౌతంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. దీంతో టోర్నీ కోసం ఇప్పటికే పలువురు అభిమానులు లండన్‌కు చేరుకున్నారు. టోర్నీకే హైలెట్‌గా నిలవనున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 16న ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications