నిబంధనలు ఉల్లంఘించిన టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌.. విచారణ అనంతరం చర్యలు

ICC Cricket World Cup 2019: Senior Indian Cricketer Under Scanner For Flouting Family Clause During World Cup

టీమిండియాకి చెందిన ఓ సీనియర్‌ క్రికెటర్‌ ప్రపంచకప్‌ టోర్నీలో బీసీసీఐ కుటుంబ నిబంధనలను ఉల్లఘించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. ఆ ఓ సీనియర్‌ క్రికెటర్‌ ఎవరనేది మాత్రం తెలియరాలేదు. అయితే విచారణ జరిపిన అనంతరం సదరు క్రికెటర్‌పై చర్యలు తీసుకుంటాం అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ ఓటమి.. బోణీ కొట్టిన యుముంబా, బెంగళూరు

అభ్యర్థనపై చర్చ:

అభ్యర్థనపై చర్చ:

ప్రపంచకప్‌ టోర్నీ జరుగుతున్న సమయంలో తన భార్యతో కలిసి ఉండడానికి మొదటగా ఆ సీనియర్‌ క్రికెటర్‌ బీసీసీఐ పాలకుల కమిటీని కోరాడు. మే 3న జరిగిన సమావేశంలో అధికారులు ఈ అభ్యర్థనపై చాలా సమయం చర్చించారు. ఆ సమావేశంలో అధికారులు సదరు క్రికెటర్‌ అభ్యర్థనను నిరాకరించారు.

నిబంధనలను ఉల్లంఘించి:

నిబంధనలను ఉల్లంఘించి:

బీసీసీఐ నిబంధల ప్రకారం టోర్నీ ప్రారంభమైన మొదటి 20 రోజుల వరకు కుటుంబ సభ్యులు ఇంగ్లండ్‌ వెళ్లే అవకాశం లేదు. అయితే టోర్నీ మధ్యలో 15 రోజుల పాటు జట్టులోని ప్రతీ ఆటగాడు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ క్రికెటర్‌ ఈ నిబంధనలను ఉల్లంఘించి టోర్నీ ఆసాంతం తన భార్యతోనే కలిసి ఉన్నాడట.

విచారణ చేస్తాం:

విచారణ చేస్తాం:

ఆ సీనియర్ క్రికెటర్‌ తన భార్యతో కలిసి ఉండేందుకు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి, మేనేజర్‌ సునీల్‌ సుబ్రహ్మణ్యంల అనుమతి కూడా తీసుకోలేదట. ఎవరి అనుమతీ లేకుండా ఆటగాడు టోర్నీ మొత్తం (ఏడు వారాల పాటు) తన భార్యతో కలిసి ఉంటే జట్టు మేనేజర్‌ ఏం చేస్తున్నారని ఓ బీసీసీఐ అధికారి ప్రశ్నించాడు. ఈ విషయంపై జట్టు మేనేజర్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని క్రికెట్‌ పాలకుల కమిటీ దృష్టికి తీసుకెళతాం, విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆ అధికారి స్పష్టం చేశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, July 21, 2019, 12:01 [IST]
Other articles published on Jul 21, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more