
అభ్యర్థనపై చర్చ:
ప్రపంచకప్ టోర్నీ జరుగుతున్న సమయంలో తన భార్యతో కలిసి ఉండడానికి మొదటగా ఆ సీనియర్ క్రికెటర్ బీసీసీఐ పాలకుల కమిటీని కోరాడు. మే 3న జరిగిన సమావేశంలో అధికారులు ఈ అభ్యర్థనపై చాలా సమయం చర్చించారు. ఆ సమావేశంలో అధికారులు సదరు క్రికెటర్ అభ్యర్థనను నిరాకరించారు.

నిబంధనలను ఉల్లంఘించి:
బీసీసీఐ నిబంధల ప్రకారం టోర్నీ ప్రారంభమైన మొదటి 20 రోజుల వరకు కుటుంబ సభ్యులు ఇంగ్లండ్ వెళ్లే అవకాశం లేదు. అయితే టోర్నీ మధ్యలో 15 రోజుల పాటు జట్టులోని ప్రతీ ఆటగాడు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ క్రికెటర్ ఈ నిబంధనలను ఉల్లంఘించి టోర్నీ ఆసాంతం తన భార్యతోనే కలిసి ఉన్నాడట.

విచారణ చేస్తాం:
ఆ సీనియర్ క్రికెటర్ తన భార్యతో కలిసి ఉండేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యంల అనుమతి కూడా తీసుకోలేదట. ఎవరి అనుమతీ లేకుండా ఆటగాడు టోర్నీ మొత్తం (ఏడు వారాల పాటు) తన భార్యతో కలిసి ఉంటే జట్టు మేనేజర్ ఏం చేస్తున్నారని ఓ బీసీసీఐ అధికారి ప్రశ్నించాడు. ఈ విషయంపై జట్టు మేనేజర్ ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని క్రికెట్ పాలకుల కమిటీ దృష్టికి తీసుకెళతాం, విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆ అధికారి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications












