
కొన్ని సమీకరణాలు చూస్తే ప్రపంచకప్ తుది జట్టులో టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉండడు అని ప్రముఖ వ్యాఖ్యాత, భారత మజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. మే 30 నుండి మెగా టోర్నీ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తోలి మ్యాచ్ జరగనుండగా.. జూన్ 5న దక్షిణాఫ్రికాతో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచకప్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా జరగనున్నాయి. అక్కడి పిచ్‌లు పేస్ బౌలర్లకు స్వర్గధామం. పిచ్‌లు అన్ని ప్లాట్‌గా ఉండడంతో పేసర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జట్లు కూడా కనీసం ముగ్గురు పేసర్లకు అవకాశం కల్పిస్తుంది. ఈ క్రమంలో భారత్ జట్టులో ముగ్గురు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లు ఉన్నారు. వీరితో పాటు పేస్ ఆలౌరౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు.

అశ్విన్, జడేజాలను స్థానాలను కైవసం చేసుకుని గత కొంత కాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కుల్దీప్-చహల్‌లు. వీరిద్దరిని తుది జట్టులో ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ అనుకుంటే.. అప్పుడు ఒక పేసర్‌పై వేటు పడుతుంది. ఒకవేళ టీమ్ మేనేజ్‌మెంట్ ఇదేవిధంగా ఆలోచిస్తే.. భువనేశ్వర్‌పైనే వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే అభిప్రాయాన్ని సంజయ్ మంజ్రేకర్ తెలియజేశాడు.
'జట్టులో బుమ్రా కీలక బౌలర్. షమీ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో భువీ అంతగా ప్రభావం చూపలేదు. గాయాల కారణంగా కొన్ని మ్యాచులకు దూరంగా ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్‌గా పాండ్యా ఉన్నాడు. అతడు బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇద్దరు స్పిన్నర్లు కావాలనుకుంటే భువనేశ్వర్‌పైనే వేటు పడే అవకాశం ఉంది' అని సంజయ్ అభిప్రాయపడ్డాడు.