వరల్డ్‌కప్ విజేతకు ట్రోఫీ: సచిన్‌కు అరుదైన గౌరవం దక్కనుందా?

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్త సంప్రదాయానికి తెరలేపనుందా? ఎప్పటిలా ఐసీసీ చైర్మన్ కాకుండా మరొకరు వరల్డ్‌కప్ విజేతకు ట్రోఫీని బహూకరించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఐసీసీ సంప్రదాయం ప్రకారం
ఐసీసీ సంప్రదాయం ప్రకారం జులై 14న లార్డ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనున్న ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహార్ ట్రోఫీని బహుకరించాల్సి ఉంది. కానీ, ఈసారి అందుకు భిన్నంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ లేదా గత విజేత ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ చేత ట్రోఫీని అందించే విధంగా ఐసీసీ ఆలోచన చేస్తోంది.

వీరిద్దరూ కాకుంటే బ్రిటన్ రాజవంశానికి చెందిన వ్యక్తి
వీరిద్దరూ కాకుంటే బ్రిటన్ రాజవంశానికి చెందిన వ్యక్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనే యోచనలో కూడా ఐసీసీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ముగ్గురిలో సచిన్ టెండూల్కర్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రపంచ క్రికెట్‌లో సచిన్ పేరు తెలియని అభిమాని ఉండరు. యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా సచిన్ టెండూల్కర్ ఉన్నారు.

మంగళవారం నుంచి సెమీస్ మ్యాచ్‌లు
ఇదిలా ఉంటే, ఈ ప్రపంచకప్‌లో సెమీస్ మ్యాచ్‌లు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తోన్న ఈ ప్రపంచకప్‌లో టాప్-4లో నిలిచిన ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. టోర్నీలో భాగంగా తొలి సెమస్‌లో ఇండియా-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.

జులై 14న ప్రపంచకప్ ఫైనల్
మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్‌కి ఓల్ట్ ట్రాఫోర్డ్ ఆతిథ్యమిస్తోంది. ఇక, గురువారం జరగనున్న రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్‌కి బర్మింగ్ హామ్ వేదిక కానుంది. ఇక, ఈ రెండు మ్యాచ్‍ల్లో గెలిచిన జట్లు జులై 14(ఆదివారం) లార్డ్స్ వేదికగా జరిగే ఫైనల్లో తలపడతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications