బంగ్లాపై సెంచరీ: టాప్‌లోకి రోహిత్ శర్మ, బద్దలు కొట్టిన రికార్డులివే!

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. విభిన్న పిచ్‌లు, భిన్న పరిస్థితుల్లో ఒకే తరహా ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 104 పరుగులు చేసి ఔటైన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 516 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్‌ను రోహిత్ శర్మ వెనక్కినెట్టాడు.
ఐదు వందలకు పైగా పరుగులు
దీంతో పాటు ఒక వరల్డ్‌కప్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ గుర్తింపు పొందాడు. గతంలో భారత్ తరఫున ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో జాబితాలో సచిన్ టెండూల్కర్(673) అగ్రస్థానంలో ఉన్నాడు. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ ఈ ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కాగా... మొత్తంగా 26వ సెంచరీ కావడం విశేషం.
ఒక ప్రపంచకప్‌లో నాలుగు సెంచరీలు
తద్వారా ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర(4 సెంచరీలు) రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. ఇక, ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. రోహిత్ కన్నా ముందు సచిన్ టెండూల్కర్ ఆరు సెంచరీలతో ముందున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్‌లపై సెంచరీలు సాధించాడు.
సెంచరీ అనంతరం ఔట్
ఇప్పుడు బంగ్లాపై సెంచరీతో చెలరేగాడు. షకీబ్ వేసిన 29వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ 92 బంతుల్లో 104(7 ఫోర్లు, 5 సిక్సులు) సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో జట్టు స్కోరు 180 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇది వరల్డ్‌కప్‌లో భారత్‌కు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.
ధోని సిక్సర్ల రికార్డు బద్దలు
అంతకముందు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు 174 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం సాధించారు. 2015 వరల్డ్‌కప్‌లో ధావన్‌తో కలిసి రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డుని రోహిత్-రాహుల్‌లు బద్దలు కొట్టారు. దీంతో పాటు వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి చేరాడు. ప్రస్తుతం రోహిత్ 230 వన్డే సిక్సర్లు సాధించాడు. ఇక భారత్ తరఫున అత్యధిక వన్డే సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలిచాడు. ధోని 228 సిక్సర్ల రికార్డుని రోహిత్ శర్మ అధిగమించాడు.
{headtohead_cricket_3_10}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications