'రోహిత్ పరిస్థితి దారుణం, ఈ ఫలితం నాకు నిరాశను కలిగించింది'

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. టోర్నీలో భాగంగా బుధవారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన తొలి సెమీపైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ "టీమిండియా ఇలా టోర్నీ నుంచి నిష్క్రమించడం జీర్ణించుకోలేకపోతున్నాం. రోహిత్‌శర్మ పరిస్థితి దారుణంగా ఉంటుంది. రోహిత్ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అతడి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను" అని సచిన్ అన్నాడు.

ప్రతీ ఒక్కరికీ ఇది గడ్డు కాలం
"ఈ ప్రపంచకప్‌పై అభిమానులందరూ ఎన్నో కలలు కన్నారని, ప్రతీ ఒక్కరికీ ఇది గడ్డు కాలం. డ్రెస్సింగ్‌రూమ్‌లో పరిస్థితి బాధగా ఉన్నా 240 పరుగుల టార్గెట్ ఛేదించదగినదే. జట్టు సభ్యులకే కాదు ఇతర స్టాఫ్ కూడా చాలా బాధపడతారు. టోర్నీ కోసం ఎన్నో రోజులు శ్రమించి ఉంటారు" అని సచిన్ తెలిపాడు.

ప్రతీ ఆటగాడికీ కొంత సమయం పడుతుంది
"ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి ప్రతీ ఆటగాడికీ కొంత సమయం పడుతుంది. అన్ని గాయాలకు సమయమే సరైన చికిత్స. ఒక భారతీయుడిగా నాకు ఈ ఫలితం నిరాశ కలిగించింది" అని సచిన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

లీగ్ దశలోనే ఐదు సెంచరీలు
లీగ్ దశలోనే ఐదు సెంచరీలు సాధించి టాప్ స్కోరర్‌గా ఉన్న అతడు ఈ ప్రపంచకప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు ఒక్క పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా మ్యాచ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది.

18 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి
ఆ తర్వాత రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) చివరివరకు పోరాడినప్పటికీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయారు. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో టీమిండియా రెండోసారి సెమీస్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించగా... న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications