వన్డేల్లో 1000 పరుగులు: మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత

హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 440 పరుగులు చేశాడు. తాజాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు సాధించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మ్యాచ్‌కు ముందు 4 పరుగుల దూరంలో
మ్యాచ్‌కు ముందు ఈ ఏడాది 1000 పరుగులు సాధించడానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న రోహిత్ శర్మ సిక్స్ బాది ఈ ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ బౌలర్ మొర్తజా వేసిన తొలి ఓవర్ నాలుగో బంతిని సిక్స్‌గా బాది రోహిత్ శర్మ తన పరుగుల ఖాతా తెరిచాడు. రోహిత్ శర్మ 1000 పరుగులను తన 20వ ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు.

1000 పరుగులు అందుకున్న మూడో క్రికెటర్
తద్వారా ఈ ఏడాది 1000 పరుగులు అందుకున్న మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మకు ముందు ఆరోన్ పించ్(1138), ఉస్మాన్ ఖవాజా(1067)లు 1000 పరుగులు సాధించారు. రోహిత్ శర్మ గత 19 మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో 996 పరుగులు చేశాడు. రోహిత్ యావరేజి 55.33గా నమోదైంది.

ఈ ఏడాది అత్యధిక స్కోరు 140
మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన 140 పరుగులే ఈ ఏడాది అత్యధిక పరుగులు కావడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగుల్ని సాధించడానికి కోహ్లి 7 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా, బంగ్లాతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.
{headtohead_cricket_3_10}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications