For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌ జట్టులో అతడే డేంజరస్ బ్యాట్స్‌మన్‌: పాంటింగ్‌

ICC Cricket World Cup 2019 : Ricky Ponting Picks Out England’s ‘Dangerman’ At World Cup || Oneindia
ICC Cricket World Cup 2019: Ricky Ponting identifies England’s ‘dangerman’ at World Cup

ప్రస్తుతం ఇంగ్లాండ్‌ జట్టు వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఆ జట్టులో చివరి వరకు మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. అయితే జోస్‌ బట్లర్‌ మాత్రం అత్యంత డేంజరస్ బ్యాట్స్‌మన్‌, అతనిపై అన్ని జట్లు జాగ్రత్తగా ఉండండని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ సూచించాడు. మరో వారం రోజుల్లో ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీలు తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా రికీ పాంటింగ్‌ కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

బట్లర్‌ డేంజరస్ బ్యాట్స్‌మన్‌:

బట్లర్‌ డేంజరస్ బ్యాట్స్‌మన్‌:

'ఇంగ్లాండ్‌ జట్టులో జట్టులో చివరి వరకు మ్యాచ్‌ విన్నర్లు ఉన్నా జోస్‌ బట్లర్‌ డేంజరస్ బ్యాట్స్‌మన్‌. గత రెండు మూడేళ్లుగా అతడు తన బ్యాటింగ్ లో ఎలా మెరుగయ్యాడో చూశాను. రెండు మూడు సీజన్ల క్రితం ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా ఉన్నపుడు అతను అంతర్జాతీయ క్రికెట్‌లో తన ముద్రవేసేందుకు ప్రయత్నిస్తున్నాడు' అని పాంటింగ్‌ తెలిపారు.

360 డిగ్రీల్లో షాట్లు ఆడగలడు:

360 డిగ్రీల్లో షాట్లు ఆడగలడు:

'గత 12-18 నెలలుగా ఇంగ్లాండ్‌ తరఫున టీ20, వన్డే, టెస్టుల్లో అతడి అద్భుతంగా ఆడుతున్నాడు. అందుకే ఇంగ్లాండ్‌ జట్టులో బట్లర్‌ డేంజరస్ బ్యాట్స్‌మన్‌. బట్లర్‌ కీపింగ్‌లో కొంచెం తడబడ్డా.. మిడిలార్డర్‌లో మాత్రం పరుగులు చేస్తూ జట్టుకు అండగా ఉంటాడు. అతడు మైదానంలో 360 డిగ్రీల్లో షాట్లు ఆడి పరుగులు చేస్తాడు. బంతిని బలంగా బాదగలడు కూడా' అని పాంటింగ్‌ పేర్కొన్నాడు.

సొంత గడ్డపై ఆడటం కలిసొచ్చే అంశం

సొంత గడ్డపై ఆడటం కలిసొచ్చే అంశం

ఇంగ్లాండ్ జట్టులో చివరి వరకు బ్యాటింగ్‌ చేసేవాళ్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. మోర్గాన్, బరిస్టో, రూట్, స్టోక్స్, ఆర్చర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. దీంతో ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తోంది. ఇక బట్లర్‌, స్టోక్స్‌, అలీ వంటి ఆటగాళ్లు 6, 7, 8 స్థానాల్లో హార్డ్‌ హిట్టింగ్‌ చేయగలరు. సొంత గడ్డపై ఆడటం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం' అని పాంటింగ్‌ చెప్పుకొచ్చారు.

దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌ తొలి పోరు:

దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌ తొలి పోరు:

ఈ నెల 30న జరిగే ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌ తలపడుతుంది. అంతకంటే ముందు 25న ఆసీస్‌తో, 27న అఫ్గానిస్తాన్‌తో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో విశ్వవిజేతగా నిలవాలని ఇంగ్లండ్‌ పట్టుదలతో ఉంది.

ఇంగ్లాండ్ జట్టు:

ఇంగ్లాండ్ జట్టు:

ఇయామ్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, లియాం ప్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, జేమ్స్ విన్సీ, క్రిస్ వోక్స్, మార్క్ ఉడ్.

Story first published: Thursday, May 23, 2019, 11:23 [IST]
Other articles published on May 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+