ప్రపంచకప్‌.. టాస్‌ నెగ్గి స్విమ్మింగ్‌ ఎంచుకున్న భారత్‌

ICC Cricket World Cup 2019 : Best Memes And Jokes On Ind Vs NZ Match Halt || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Rain halts India vs NZ World Cup match, Best memes and jokes to spend your time on

ప్రపంచకప్‌లో భాగంగా గురువారం భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. నాటింగ్‌హామ్‌లో బుధవారం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం చిత్తడిగా మారింది. దీంతో కనీసం టాస్‌ కూడా పడకుండానే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకూ ఒక్కో పాయింట్‌ కేటాయించారు. దీని కంటే ముందు పాకిస్థాన్‌-శ్రీలంక, దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌, శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌ 2019 టోర్నీకి ముందు వరకు ప్రపంచకప్‌లో 402 మ్యాచ్‌లు జరిగితే.. అందులో టాస్‌ పడకుండా రద్దయిన మ్యాచ్‌లు కేవలం రెండు మాత్రమే. కానీ ఈ టోర్నీలో ఇప్పటిదాకా 19 మ్యాచ్‌లు జరగ్గా.. మూడు టాస్‌ పడకుండానే రద్దయిపోయాయి. మరో మ్యాచ్‌ ఆట ఆరంభమైన కాసేపటికి ఆగిపోయింది.

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఐసీసీ, ఇంగ్లండ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెటైరికల్‌ మీమ్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జోకులు పేల్చుతున్నారు.

'ఈ రోజటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి భారత్‌ స్మిమ్మింగ్‌ ఎంచుకుంది' అని ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. 'ఇంగ్లండ్‌లో క్రికెట్‌ ఆడాలంటే అండర్‌ వాటర్‌లో ఆడటం నేర్చుకోవాలి' అని మరో నెటిజన్ పోస్ట్ చేసాడు. 'ప్రపంచకప్‌, వర్షం రెండూ ఇంగ్లండ్‌ను వదలడం లేదు'.. 'టాస్‌ గెలిచిన వాతావరణం వర్షాన్ని ఎంచుకుంది'.. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, సిరీస్‌ అవార్డులు వర్షం నీటిని ఎత్తిపోసిన సిబ్బందికి ఇవ్వాలి' అని పోస్టులు పెడుతున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 14, 2019, 10:31 [IST]
Other articles published on Jun 14, 2019
POLLS

Get breaking news alerts from myKhel

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more