Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌లో బౌలింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది: రాహుల్ ద్రవిడ్‌

ICC Cricket World Cup 2019: Rahul Dravid optimistic about Indias CWC chances

ఈ ప్రపంచకప్‌ చాలా కష్టమైంది, ఎందుకంటే కప్‌ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రపంచకప్‌లో బౌలింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. మెరుగైన బౌలింగ్‌ ప్రదర్శన చేసిన జట్టుకు కప్ సాధించే అవకాశాలు ఉన్నాయి అని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ పిచ్‌లపై భారత్ ఏ మేరకు రాణిస్తుందని పలువురు మాజీ క్రికెటర్లు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రపంచకప్‌ గురించి రాహుల్ ద్రవిడ్‌ స్పందించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

'గత సంవత్సరం ఇండియా-ఏ జట్టు అక్కడ పర్యటించింది. ఆ అనుభవంతో చెపుతున్నా.. ఈ సారి భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. భారీ స్కోరింగ్ పిచ్‌లపై బౌలర్లు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. ఇందులో టీమిండియా లక్కీ జట్టు. ఎందుకంటే చాహల్, కుల్దీప్, బుమ్రాలు ఉన్నారు. వీరందరూ గత కొంత కాలంగా వికెట్లు తీస్తున్నారు. ఇది టీమిండియాకు కలిసొచ్చే అంశం' అని ద్రవిడ్‌ అన్నారు.

'ఈ ప్రపంచకప్‌ గెలవడం చాలా కష్టం, ఎందుకంటే కప్‌ కోసం అన్ని జట్లు బాగా సన్నద్ధమవుతున్నాయి. భారత్‌ కచ్చితంగా ఫేవరేట్. ఈసారి ప్రపంచకప్‌ గెలుస్తుందన్న నమ్మకం ఉంది. అయితే భారీ స్కోరింగ్‌ పిచ్‌లపై మన బౌలర్లు ఏ మేరకు రాణిస్తారన్నదానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మనకు మంచి బౌలర్లు ఉన్నారు. బుమ్రాతో పాటు షమీ, భువనేశ్వర్‌, హార్దిక్‌ పాండ్య సైతం వేగంగా బంతులు వేయడంతో పాటు బంతిని స్వింగ్‌ చేయగలరు. అయితే, ఇంగ్లాండ్‌లోని పరిస్థితులకు తగ్గట్టుగా వారు తమ బౌలింగ్‌లో మార్పులు చేయాలి. ప్రపంచకప్‌లో బౌలింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. మెరుగైన బౌలింగ్‌ ప్రదర్శన చేసిన జట్టుకు కప్ సాధించే అవకాశాలు ఉన్నాయి అని ద్రవిడ్‌ పేర్కొన్నారు.

Story first published: Wednesday, May 22, 2019, 18:08 [IST]
Other articles published on May 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+