Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డీకాక్‌ స్టన్నింగ్ క్యాచ్.. సౌమ్య సర్కార్‌ ఔట్ (వీడియో)

ICC Cricket World Cup 2019: Quinton de Kocks incredible catch in South Africa vs Bangladesh Match

ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభమైన 12వ ఎడిషన్ వన్డే ప్రపంచకప్‌ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకోగా.. వెస్టిండిస్ వికెట్ కీపర్ షాయ్‌ హోప్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో పాక్ ప్రధాన ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ను వెనక్కి పంపాడు. స్టోక్స్ పట్టిన క్యాచ్‌ని మాజీ క్రికెటర్లు 'క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ'గా అభివర్ణిస్తున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇక ఆదివారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ డీకాక్‌ ఒక స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ (42; 30 బంతుల్లో 9 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. క్రిస్‌ మోరిస్‌ వేసిన 12 ఓవర్‌ నాలుగో బంతిని సౌమ్య సర్కార్‌ పుల్‌ చేయబోయాడు. బంతి కాస్త గ్లౌవ్‌ను తాకి అక్కడే గాల్లోకి లేచింది. వికెట్లకు దూరంగా ఉన్న డీకాక్‌.. పరుగెత్తూకుంటూ వచ్చి బంతి కింది పడే సమయంలో డైవ్‌ చేసి ఒడిసి పట్టాడు. దీంతో అర్ధ సెంచరీకి చేరువలో ఉన్న సౌమ్య నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్ ఆ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో.. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ చేస్తోంది. బంగ్లా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 60 పరుగులు చేసాక ఇక్బాల్‌ (16) ఔటయ్యాడు. అనంతరం మరో 15 జోడించాక సౌమ్య సర్కార్‌ పెవిలియన్‌ చేరాడు. కష్టాల్లో ఉన్న జట్టును షకీబ్, రహీంలు అర్ధ సెంచరీలు చేసి ఆదుకున్నారు. ప్రస్తుతం బంగ్లా 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

Story first published: Sunday, June 2, 2019, 18:14 [IST]
Other articles published on Jun 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+