For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అన్నీ కఠినమైన మ్యాచ్‌లే.. ఇంగ్లండ్‌ సెమీస్ చేరుతుందా?

ICC Cricket World Cup 2019: Qualification Scenarios Open Up After Sri Lankas Shock Win Over England

ప్రపంచకప్‌ ప్రారంభం కాకముందు టోర్నీ ఫేవరేట్ ఎవరంటే భారత్, ఇంగ్లండ్ అని తడుముకోకుండా చెప్పశారు. భారత్ అంచనాలను అందుకుని టోర్నీలో అపజయమన్నదే లేకుండా దూసుకెళుతోంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం అంచనాలను తలక్రిందులు చేసింది. ఇంగ్లండ్‌ సెమీస్ చేరే అవకాశం ఉంది. అయితే అన్నీ కఠినమైన మ్యాచ్‌లే ఉండడంతో కొంచెం సందేహం కలుగుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సెమీస్ చేరడం సులువే:

సెమీస్ చేరడం సులువే:

భారత్ పటిష్ట దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి జట్లను మట్టికరిపించింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయింది. అఫ్గానిస్థాన్‌పై పోరాడి గెలిచింది. ప్రస్తుతం 9 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లను విండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో ఆడనుంది. ఇంగ్లండ్ మినహా అన్ని జట్లు ఫామ్ లో లేవు. ఈ నేపథ్యంలో టీమిండియా సెమీస్ చేరడం సులువే.

ఒక్క మ్యాచ్ గెలిచినా:

ఒక్క మ్యాచ్ గెలిచినా:

న్యూజిలాండ్‌ కూడా భారత్‌ మాదిరిగానే అపజయమన్నదే లేకుండా ఉంది. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దవగా.. ఆడిన ఐదింట్లోనూ గెలిచి 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ లాంటి బలహీన జట్లపై విజయం సాధించిన కివీస్ జట్టుకు ఇక కఠిన పరీక్షే. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో కివీస్‌ తలపడాల్సి ఉంది. అయితే ఒక మ్యాచులో గెలిచినా సెమీస్‌ చేరుకుంటుంది.

మరో విజయం:

మరో విజయం:

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు కూడా సెమీస్ చేరడానికి చేరువలో ఉంది. భారత్ మ్యాచ్ తప్ప అన్ని గెలిచింది. ప్రస్తుతం ఆ జట్టు ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్లతో ఆడాల్సి ఉంది. అన్ని పటిష్ట జట్లే అయినా.. మరో విజయం సాధిస్తే ఆ జట్టు సెమీ ఫైనల్‌ బెర్త్‌ ఖాయమవుతుంది.

కఠిన ప్రత్యర్థులే:

కఠిన ప్రత్యర్థులే:

దక్షిణాఫ్రికాపై విజయంతో ఇంగ్లండ్ శుభారంభం చేసినా.. తమకంటే ఎంతో బలహీనమైన జట్లయిన పాక్‌, లంక చేతుల్లో ఓడిపోయింది. ఇంగ్లండ్ ఆరు మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానములో ఉంది. ఇంగ్లండ్ సెమీస్ చేరాలంటే ఇంకా రెండు విజయాలు కావాలి. అయితే మూడు మ్యాచ్‌లు ఉన్నా.. కఠినమైన ప్రత్యర్థులతోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడితే ఆ జట్టు నాకౌట్‌ దశ అవకాశాలకు దెబ్బపడినా ఆశ్చర్యం లేదు. మరోవైపు బంగ్లా, పాక్, లంకల నుండి ఇంగ్లండ్ జట్టుకు ప్రమాదం పొంచి ఉంది. ఇంగ్లండ్‌ చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోతే లంక, బంగ్లాకు సెమీస్‌ బెర్త్‌ అవకాశాలు ఉంటాయి.

Story first published: Monday, June 24, 2019, 16:22 [IST]
Other articles published on Jun 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+